Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా రంగంలో ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఒక హీరోకి కొంతకాలం విపరీతమైన క్రేజ్ ఉండి.. ఆ హీరో ఏజ్ పెరిగే కొద్దీ ఆ హీరో తర్వాత వాళ్ళు వారసులు సినిమా రంగంలో నిలబడడం అనేది సహజం. వాళ్లకి నిజంగానే అభిమానులు ( Akira Nandan first movie ) కూడా అంత ఆదరణ ఇస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరు ఆయన వారసత్వం ఉంటాది అంటే ఆయన కొడుకు అకిరా సినిమాల్లోకి వస్తాడని.. ఎప్పుడు వస్తాడా అని.. ఎలాంటి సినిమా చేస్తాడా అని ఆయన అభిమానులు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉన్నారు.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కొడుకు అకిరా నందన్ వయసు ఇప్పుడు 19 సంవత్సరాల వయసు. 19 ఇయర్స్ నుంచి కూడా సినిమాలో హీరోగా నటించిన వాళ్ళు ఉన్నారు.. టీన్ ఏజ్ కి సంబంధించిన మంచి కథతో ముందుకు ( Akira Nandan first movie ) వస్తే ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటాది. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అవ్వడం వలన ఇంకా ఎక్కువగా ఆదరణ ఉంటుంది. అయితే ఇదిలా ఉంటే.. అకిరా గురించి అంతా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చూసుకుంటుంది. ఈమె ఒకప్పటి హీరోయిన్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు సినిమా రంగంలో ఉన్న వాళ్లకి పుట్టిన అకిరా కి ఇంకా సినిమాలో నటించే నటన ట్యాలెంట్ కచ్చితంగా ఎక్కువ ఉంటుందని అభిమానులు నమ్మకం.
అయితే రేణు దేశాయ్ చాలా కాలంగా సినిమా రంగానికి దూరంగా ఉంది. ఆమె పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా రంగానికి దూరమై.. అతనికి విడాకులు ఇచ్చిన తర్వాత కూడా ఆమె దూరంగానే ఉంది. ఇప్పుడు మళ్లీ ( Akira Nandan first movie ) ఆవిడ సినిమా రంగంలోకి ఎంటర్ అయింది. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ కి మంచి పాత్రని ఇచ్చారు. తన వయసుకు తగ్గ పాత్రలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలని మాత్రమే నటిస్తానని చెప్పుకొచ్చింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్ నిమిత్తం రేణు దేశాయ్ పాల్గొని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలను బయటపెట్టింది.
ఇంటర్వ్యూలో సినిమా గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉండగా.. అకిరా సినిమా ఎంట్రీ గురించి ఎప్పుడవుతాడని ఇంటర్వ్యూ లో యాంకర్ అడగ్గా ఆమె ఇలా చెప్పింది.. అకిరా కి హీరో అవ్వాలని ఇంతవరకు ఏమి అనిపించలేదు. తనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు హీరోగా ఎంటర్ అవుతాడు. ఒకవేళ తన హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయితే.. మొదట అనౌన్స్మెంట్ నేనే ఇస్తాను. నేనే మీ అందరికీ చెప్తాను అని రేణు దేశాయ్ కచ్చితంగా చెప్పింది. అలాగే అకిరా ఇప్పుడు పియానో, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్,యోగ అవి నేర్చుకుంటున్నాడని.. ఫిలిం ప్రొడక్షన్ ట్రైనింగ్ కూడా అవుతున్నాడని చెప్పుకొచ్చింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ హీరోగా చేసేది తనకి హీరోగా చేయాలనిపించినప్పుడు.. ఇంకా రేణు దేశాయ్ అనౌన్స్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది అన్న విషయం తెలిసింది.