Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ప్రాణం. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఎన్నో సంచలన విజయాలను ( Raj Kumar and Pawan Kalyan ) సాధించి.. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అభిమానులను సంపాదించి.. ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి. అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం లేకపోయినా కూడా.. ఆయన వదిన సురేఖ గారి బలవంతం వల్ల సినిమా రంగంలోకి అడుగు పెట్టానని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది.
అసలు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు అయితే పవన్ కళ్యాణ్ చర్యలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి అందులో ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేని సినిమా అంటే అత్తారింటికి దారేది. ఈ సినిమా మామూలు హిట్ కొట్టలేదు. అప్పటివరకు ( Raj Kumar and Pawan Kalyan ) కొంతకాలంగా ఫెయిల్యూర్స్ తో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో ఒక్కసారిగా మళ్లీ విపరీతమైన హై పొజిషన్ కి వెళ్లిపోవడం జరిగింది. ప్రతి ఊర్లోనీ, ప్రతి థియేటర్లో కూడా తిరుగులేని కలెక్షన్స్ తో అదరగొట్టింది. ఈ సినిమా వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, సినిమా హాల్స్ వాళ్ళు, ఆఖరికి సినిమా హాల్లో క్యాంటీన్ వాళ్ళు కూడా విపరీతంగా సంపాదించుకోవడం జరిగింది.
అంత బాగా జనాదరణ పొందిన ఈ సినిమా వలన కూడా ఒక నటుడు మూడు కోట్ల రూపాయల నష్టపోయానని.. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది వలన తన జీవితంలో చాలా పెద్ద తప్పు జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అంత బ్లాక్ బస్టర్ హీట్ అయిన సినిమా వలన ఎవరికి నష్టం జరిగింది? ఎలా నష్టం ( Raj Kumar and Pawan Kalyan ) జరిగిందో తెలుసుకుందాం. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కూడా మంచి పేరు సంపాదించుకున్న నటుడు రాజకుమార్. 2000 నుంచి 2010 వరకు ఇతను సీరియల్స్ లోని, సినిమాల్లో కూడా చాలా బాగా నటించాడు. విధి, మనోయజ్ఞం సీరియల్సు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ఇతను నిర్మాతగా హీరోగా కూడా మారి తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు. అప్పట్లో రాజ్ కుమార్ ఒక చిన్న సినిమా ప్రొడ్యూస్ చేశాడు. బారిష్టర్ శంకర్ నారాయణ అనే సినిమాను ప్రొడ్యూస్ చేయగా.. చిన్న సినిమా అని అందరూ కూడా ఇతనికి మంచి సపోర్ట్ ఇచ్చి ధియేటర్లు ఇచ్చారు.
అక్టోబర్ 12 వ తేదీఅత్తారింటికి దారేది రిలీజ్ అవుతుంది అనగా.. వీళ్ళ సినిమా సెప్టెంబర్ 21 న రిలీజ్ చేశారు. కానీ అత్తారింటికి దారేది సడన్గా ముందుగా రిలీజ్ చేసేసారు. ఎడిటింగ్ రూమ్ లో నుంచి సగం లీక్ అయిపోయింది అని అందుకే అర్జెంట్గా రిలీజ్ చేయాలని రిలీజ్ చేసేసారు. దానివల్ల ఆ సినిమాకి మొత్తం థియేటర్లు ఇచ్చేసి.. అన్నిచోట్ల అత్తారింటికి దారేది వేసేసారు. రాజ్ కుమార్ కి చివరిగా 17 థియేటర్లు మాత్రమే ఇచ్చారంట. ” ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వలన నా సినిమా మొత్తం పోయిందని మూడు కోట్ల రూపాయలు నష్టపోయానని అక్కడి నుంచి మళ్ళీ తేరుకోలేకపోయాను అని రాజ్ కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది” . ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వలన అందరికీ లాభమే అనుకుంటాం కానీ ఎక్కడో దురదృష్టవంతులకు ఇలాంటి నష్టాలు జరుగుతాయని అర్థమవుతుంది.