Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మన అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, ఆయన జనరేషన్ కాకుండా ఆయన ( Ram Charan and Jagan ) తర్వాత అనేకమంది హీరోలు ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ఒకరి తర్వాత ఒకరు మెగా హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతగా ఆకట్టుకుంటున్నారో మనందరికీ తెలిసిందే. అయితే సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా మెగా కుటుంబం చాలా స్పీడ్ గానే ఉంది.
మెగా కుటుంబం నుంచి మొదట రాజకీయాల్లోకి చిరంజీవి ప్రవేశించి.. ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి.. దానితో కొంత కాలం నడిచి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి.. ఆయన కొంతకాలం కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత రాజకీయాలకు ( Ram Charan and Jagan ) కొంచెం దూరమై సినిమాలు చేసుకుంటూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రక్రియలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన అనే పార్టీని పెట్టుకొని.. దానితో ఆయన ఇప్పటివరకు నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ టిడిపికి చేరువుగా వైసీపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతున్న సంగతి అందరికీ తెలుసు.
ఇదిలా ఉంటే దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పై యాత్ర సినిమా వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఎంతో మంచి రిజల్ట్ తీసుకొచ్చి అందరికీ గుర్తుండిపోయేలా చేసింది.అయితే ఇప్పుడు ( Ram Charan and Jagan ) జగన్మోహన్ రెడ్డి పై యాత్ర 2 సినిమా తీస్తున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ పి రాఘవ్ అనే దర్శకుడు యాత్ర సీక్వెల్ గా యాత్ర 2 సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు. ఈ సినిమాలో దివంగత రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి.. జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవ నటిస్తున్న సంగతి తెలుసు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యూవి క్రియేషన్స్ వారు తీసుకోవడం జరిగింది. అంటే యూ వి క్రియేషన్స్ ను ప్రభాస్ వాళ్ళ అన్నయ్య నడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆ బ్యానర్లో ప్రభాస్ తో పాటు రామ్ చరణ్ కూడా భాగస్వామ్యం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి బయోపిక్ లో రాంచరణ్ కు కూడా భాగస్వామ్యం ఉండడం పవన్ కళ్యాణ్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. రాజకీయాలు రాజకీయాలే.. సినిమాల సినిమాలే.. వ్యాపారం వ్యాపారమే.. దేన్ని దాన్ని ఆ భాగంలో చూసుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు తప్పా.. ఇలాంటి వాటి ద్వారా ఎవరిని ఎవరికీ వ్యతిరేకమని అనుకోవాల్సిన పనిలేదని మరికొందరి నటించిన అనుకుంటున్నారు.