Ambajipeta Marriage Band Teaser : సుహాస్ హీరోగా, శివాని హీరోయిన్ గా, దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు.. లో బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా టీజర్ చూసి అందరిలోనూ ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే ( Ambajipeta Marriage Band Teaser ) సుహాస్ కలర్ ఫోటో సినిమాతో యూత్ అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమాతో కుటుంబ కథ ల్లో సూట్ అయ్యే హీరో గా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు సుహాస్.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు తో మళ్లీ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
దర్శకుడు వెంకటేష్ మహా సమర్పణలో ఈ సినిమాని జిఏ 2 పిక్చర్స్, స్వేచ్ఛ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు సినిమాపై అనేక రకాలుగా స్పందిస్తున్నారు. టీజర్ మొదలు హీరోయిన్ ఫ్రెండ్స్ తో కలిసి చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా అని ఉదయ్కిరణ్ సినిమాలో సాంగ్ పాడుతుంటే.. దానికి హీరో మల్లిగాడు బయట బ్యాండ్ వాయిస్తూ అదే మ్యూజిక్ తో వెళ్తుంటాడు. టీజర్ మొదల్లోనే ( Ambajipeta Marriage Band Teaser ) ఈ పాటతో యూత్ ని ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో హీరో సుహాస్ ( మల్లిగాడు ) ఒక మంగళ షాప్ ని నడుపుకుంటూ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో కూడా తాను పనిచేస్తున్న సంఘటనలు చూపించారు. ఈ సినిమా బాగా రూరల్ ప్రాంతంలో అతి సామాన్యం కంటే కింద స్థాయిలో ఉన్న ఒక కుర్రాడి లవ్ స్టోరీ ని తీశారు అని అర్థమవుతుంది. మంగళ షాప్ నడుపుకుంటున్న మల్లిగాడు కాలేజీ చదువుకుంటున్న అమ్మాయిని ప్రేమించడం.. అసలు కథగా తెలుస్తుంది.
మీరు ఐబ్రోస్ చేస్తారా అని హీరోయిన్ అడిగితే.. ఐబ్రోస్ అంటే షేవింగా అని సుహాస్ అడిగిన ప్రశ్న యూత్ ని ఆకట్టుకునినవ్వు రప్పిస్తుంది. ఇలా సినిమాలో కామెడీ అనేది కొంతమేరకు ఉంటుందని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో సుహాస్ రొమాన్స్ కూడా బాగానే చూపించేలా ఉన్నాడని అర్థమవుతుంది. హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ ని టీజర్ లో బాగానే చూపించారు. అలాగే ఈ సినిమాలో వీళ్ళిద్దరి ప్రేమకి ఆటంకాలు వస్తాయని క్లియర్ గా అర్థమవుతుంది. కానీ టీజర్ చివర్లో సుహాస్ కి గుండు గీస్తూ ముగించారు. అయితే ( Ambajipeta Marriage Band Teaser ) సుహాస్ కి ఎందుకు గుండు గీస్తున్నారు అనే ప్రశ్న ఆడియన్స్ ఊహకి వదిలేశారు. దీనితో ఆడియన్స్ సుహాస్ కి గుండు తీయడం వెనక రహస్యం ఏమిటబ్బా అని ఆలోచనలో పడ్డారు. అయితే ఈ సీన్ సినిమా మొదల్లో ఉంటుందా? అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాగ్ చూపిస్తారా లేదా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందా లేదా క్లైమాక్స్ అవుతుందా అనేదానిపై ఎవరికి వాళ్ళు డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే హీరోకి గుండు గీసే సీన్ కచ్చితంగా క్లైమాక్స్ లో ఉండదు అనేది ఎక్కువ మంది ఆలోచన. ఎందుకంటే.. చివరిలో హీరో అంతలా ఓడిపోవడం అనేది ఆడియన్స్ కి నచ్చదు.
ఇక ఇంటర్వెల్ బ్యాంక్ గాని లేదా సినిమా మొదలు ఇదే చూపించి అసలు ఏం జరిగింది అనే ప్రశ్నకి అక్కడ నుంచి ఫ్లాష్ ప్యాక్ మొదలవుతుందని ఎక్కువమంది అనుకుంటున్నారు. ఏదేమైనా టీజర్ తో ఇది ఒక లవ్ స్టోరీ కామన్ స్టోరీ అని టీజర్ ని వదిలేయకుండా.. ఇలాంటి ఒక ప్రశ్నార్థకాన్ని, సందేహాన్ని ఆడియన్స్ లో కలిగించి టీజర్ ను వదలడంలో చిత్ర బృందం వారి తెలివి కనిపిస్తుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే సుహాస్ వరుస హిట్స్ తో ఒక వెలుగు వెలుగుతాడు. సాధ్యమైనంత వరకు సినిమా హిట్ అవ్వడానికే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా టీజర్ చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా లో బడ్జెట్లో మంచి కంటెంట్ తో వచ్చే సినిమాల్ని ఆదరిస్తుండటం వలన.. ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారేమో అని అనుకుంటున్నారు. చూద్దాం మరి సుహాస్ మళ్లీ ఒక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో..