అక్కినేని వారసుడు అఖిల్ ప్రతీ సినిమాలో తనదైన శైలిలో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అఖిల్ హీరోగా చేసినా తొలి సినిమా నుంచి కూడా అక్కినేని అభిమానులకు అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే సిసింద్రీ సినిమాలో బాల నటుడిగా నటించి అందరిని ఆకట్టుకున్నాడు. నాగార్జున, అమలల ముద్దుల కొడుకు అయిన అఖిల్ అంటే అక్కినేని అభిమానులకు కూడా చాలా ఇష్టం.
అఖిల్ ఎంత కష్టమైన, కఠినమైన పాత్ర పోషించినా కూడా అభిమానులకు మాత్రం అఖిల్ చాలా చిన్నోడుగా కనిపిస్తూ ఉంటాడు. అది ఒకరకంగా అఖిల్ కి లాభం అయితే మరొక రకంగా అప్పుడప్పుడు నష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఆర్టిస్ట్ ని ఆ పాత్రలో ఏక్సప్ట్ చెయ్యడం చాలా అవసరం. అందుకే ఆర్టిస్ట్ అనేవాడు ఎలాంటి పాత్రను అయినా, ఆడియన్స్ తనను ఒపుకునేలా నటించడమే చూస్తారు గాని ఎలాంటి పాత్ర చేసాడు అని ఎవ్వరూ చూడరు.
అక్కినేని కుటుంభానికి అభిమానులను ఎలా సంతృప్తి పరచాలో బాగా తెలుసు. నిమ్మదిగా అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదిస్తారు. అదే దిశగా ఈ తరం హీరోలు నాగ చైతన్య మరియు అఖిల్ కూడా వెళ్తున్నారు. అఖిల్ హీరోగా చేస్తున్న ఏజెంట్ సినిమా గత ఏడాది నుంచి రిలీజ్ అవుతుంది అని అంటూనే, ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఇక ఈ సినిమా అన్ని పూర్తి చేసుకుని ఏప్రిల్ లో విడుదలకు సిద్ధంగా ఉందని ప్రకటన చేసారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవు.
అయితే ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అనుకున్నది కాస్త 80 కోట్లు అయ్యిందట. మరి నిర్మాత అనిల్ సుంకరకి బడ్జెట్ డబల్ అవ్వడం నష్టమే అయినా కూడా సినిమా కలెక్షన్ గట్టిగా వస్తే పరవాలేదు. ఈ సినిమాకి సురేందర్ రెడ్టి దర్శకత్వం వహించారు.