Home Cinema Raviteja World cup 2023 : వరల్డ్ కప్ లో రవితేజ కామెంట్రీ లో ఆ...

Raviteja World cup 2023 : వరల్డ్ కప్ లో రవితేజ కామెంట్రీ లో ఆ పాయింట్స్ వైరల్ అవుతున్నాయి..

raviteja-commentary-details-for-world-cup-2023-india-vs-australia

Raviteja World cup 2023 : ఎప్పుడు ఎవరికీ ఎలాంటి అవకాశం దొరుకుతుందో, అది ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో ఎవ్వరికి తెలియదు కానీ.. ఒక్కటైతే మాత్రం తెలుస్తుంది. మనం దేనినైనా నమ్ముకొని అదే బాటలో వెళ్తూ.. అదే దానిలో కష్టపడుతూ ఉంటే చివరకు మనకంటూ ఒక మంచి స్థానం వస్తుంది. అలాగే ఈరోజు ( Raviteja World cup 2023 ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా పేరు సంపాదించుకున్న రవితేజ అంటే ఇష్టం లేని వాళ్లంటూ ఉండరు. ఒకప్పుడు వరుస హిట్స్ తో రవితేజ స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగాడు.తర్వాత కొన్ని డిజాస్టర్స్ వచ్చినప్పటికీ కొంత బ్రేక్ తర్వాత మళ్లీ ఇప్పుడు రవితేజ తన సత్తాని చాటుతున్నాడు.

Raviteja-world-cup-2023

అయితే ఈరోజు వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది. తెలుగు కామెంట్రీ బాక్సులో రవితేజ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నాడు. గతంలో ఐపీఎల్ సందర్భంగా విజయ్ దేవరకొండ ( Raviteja World cup 2023 ) కామెంట్రీ బాక్స్ లో కాదు గానీ స్టేడియంలో కనిపించి అందరికీ ఆనందాన్ని కలిగించాడు. ఇప్పుడు రవితేజ మాత్రం వరల్డ్ కప్ మ్యాచ్ కోసం కామెంట్రీ చేశాడు. ఇలా ప్రపంచ కప్ మ్యాచ్ కామెంట్రీ చేయడం ఒక తెలుగు హీరో చేయడం ఇదే మొదటిసారి. ఇలాంటి గొప్ప ఘనతని రవితేజ తన ఖాతాలో వేసుకోవడం నిజంగా ఆయన అభిమానులందరికీ ఎంతో ఆనందంగా ఉంది.

See also  Prabhas - NTR : ప్రభాస్ లక్ ని ఎన్టీఆర్ అలా లాక్కున్నాడా.. మరి సలార్ కల్కి?

Raviteja-world-cup-2023-commentry

రవితేజ తనదైన శైలిలో కామెంట్రీ ని మొదలుపెట్టి కోహ్లీ, సిరాజ్ అంటే ఇష్టమని చెప్పాడు. లేకపోతే కోహ్లీ యాటిట్యూడ్, అగ్రేషన్,లుక్ అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మ్యాచ్లో క్యాచ్ పట్టిన స్టైల్ నచ్చిందని కామెంట్రీ చేశాడు. ఇలా ఈ మ్యాచ్ ని వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ని చూస్తూ ఆనందిస్తున్న వారిలో.. ఇక తెలుగు ( Raviteja World cup 2023 ) వాళ్లయితే మరింత ఆనందంగా ఉన్నారు. ఈ మ్యాచ్ పై కామెంట్రీ ఇస్తున్న వాళ్ళ హీరోను చూసి గర్వంతో పొంగిపోతున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్ బిజీలో ఉన్నాడు. ఆ సినిమాని ఎలాగైనా బ్లాక్ బస్టర్ ఫిక్స్ చేయాలని చిత్ర బృందం వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది.

See also  Raasi : రాశికి ఆ స్టార్ హీరోతో అఫైర్ అంటగడితే.. చివరికి ఎంత పని చేసిందో చూడండి..

Raviteja-world-cup-2023-india-vs-Aistralia

టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూస్తే భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టువర్టపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీసుకున్న ఈ సినిమా విపరీతమైన అంచనాలకు వెళ్లిపోయింది. ట్రైలర్ చూస్తే అంత అద్భుతంగా ఉంది. అక్టోబర్ 20వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. టైగర్ నాగేశ్వరావు సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడానికి ముందు భారతదేశం మొత్తం చూసే ఈ క్రికెట్ మ్యాచ్ కి రవితేజ కామెంట్రీ ఇవ్వడం అనేది నిజంగా సినిమా కూడా చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. క్రికెట్ మ్యాచ్ కామెంట్రీ చెప్పే అవకాశం ఇంతవరకు ఏ తెలుగు హీరోకి రాలేదు. మొదట రవితేజ దక్కించుకున్నందుకు ఆయన అభిమానులు ఎంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.