Home Cinema Abhinaya : పుట్టుకతో మూగ చెవిటిదైన నటి అభినయ విశాల్ తో తన పెళ్లి పై...

Abhinaya : పుట్టుకతో మూగ చెవిటిదైన నటి అభినయ విశాల్ తో తన పెళ్లి పై క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. ఆ సీక్రెట్ కూడా ధైర్యంగా చెప్పేసింది..

Abhinaya-vishal-marriage-news

Abhinaya : ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. అలాగే లోపం ఇచ్చిన దేవుడు ఏదో ఒక ట్యాలెంట్ను కూడా ఇస్తాడు. దాన్ని మనం గుర్తించి దాని ద్వారా డెవలప్ అవ్వడానికి ప్రయత్నించాలి. అలాగే ( Abhinaya emotional comments about marriage ) ఏదో ఒక లోపం ఉన్న ఏ మనిషికైనా కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇచ్చే సపోర్ట్ చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది. అలాగే నటి అభినయ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులో అనేక సినిమాల్లో మంచి మంచి పాత్రలు నటించింది. నేనింతే అనే చిత్రం నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై.. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించింది.

Abhinaya-vishal-marriage-comments

శంభో శివ శంభో, దమ్ము, డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజు గారి గది 2, సీతారామం చిత్రాల్లో నటించింది. పుట్టుకతో చెవిటిది మూగది అయ్యి.. ఇంకేమీ లేదు ఏమీ చేయలేము అని అనుకోవడం చాలా తప్పు ( Abhinaya emotional comments about marriage ) అని నిరూపించేలా నటి అభినయను చూస్తే ఎంతోమందికి ఆదర్శప్రాయంగా కనిపిస్తుంది. ఇటీవల ఆమె విశాల్ తో కలిసి ఒక సినిమా కూడా చేసింది. ఆ తర్వాత ఆమె తన తండ్రితో కలిసి ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి, తాను ఎంత కష్టపడి పైకి వచ్చింది, తనకి ఎవరు సపోర్ట్ ఇచ్చారు అని ప్రతి విషయాన్ని చెప్పుకొచ్చింది.

See also  Baahubali: బాహుబలి సినిమాలో అనుష్క పాత్రని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ బ్యాడ్ లక్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Abhinaya-vishal-marriage-viral

మాట్లాడలేదు గాని తన సైగలతో అన్ని భావాలను ఎదుటి వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పగలదు. అభినయ తండ్రి మాట్లాడుతూ.. నా కూతుర్ని మొదటి మోడలింగ్ రంగంలోకి తీసుకెళ్లినప్పుడు అందరు నన్ను తిట్టారు. మాట్లాడలేదు, వినలేదు ఆమెతో ఏం చేద్దామని అని అన్నారు. అయినా కూడా నేను వెనకడుగు వేయలేదు. దేవుడి ( Abhinaya emotional comments about marriage ) మీద భారం వేసిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. మా పాలిటి దేవుడు లా సముద్రఖని కనిపించారు. ఆయన లేకుంటే ఈరోజు నా కూతురికి ఇంత కెరీర్ ఉండదు. అలాగే పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల వరకు నా కూతురు నడవలేకపోయింది. హ్యాండీక్యాప్డ్ అనుకున్నాం. కానీ ఈరోజు ఇలాంటి స్థితిలో ఉండడం నిజంగా మా అదృష్టం అని చెప్పాడు.

See also  Daksha Nagarkar: బంగార్రాజు సినిమా చేసే సమయంలో చైతు అందరి ముందు అక్కడ కిస్ చేశాడు. ఆ తర్వాత సారీ చెప్పి...

Abhinaya-comments-about-vishal-marriage

అలాగే అభినయ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల వల్లే ఈరోజు తన ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నానని.. మా నాన్న నాకు నన్ను అన్ని అయ్యి నడిపించాడని.. అతనితో నాకు మంచి స్నేహబంధం ఉందని చెప్పుకొచ్చింది. అలాగే విశాల్ తో అభినయ పెళ్లి అనే వార్తల గురించి ఆమె స్పందించింది. నేను ఆయనని చూసి నవ్వడం వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయి. ఒక ఈవెంట్ లో యాంకర్ మాట్లాడుతూ దీని గురించి అడిగింది. నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఆయన్ని ఏమి పెళ్లి చేసుకోవడం లేదు. అయినా నేను ఇంతవరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే.. ఆ వ్యక్తి ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి. రిలేషన్ లో విలువ ఉండాలి. అలాంటి అబ్బాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అభినయ ఎంతో కాన్ఫిడెన్స్ గా తన జీవితాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా.. తాను చేసుకోవాల్సింది ఒక స్టార్ హీరోని కాదని జీవితంలో కూడా రియల్ హీరోని, తనని అర్థం చేసుకునే వాడిని అంత గొప్ప వాడిని చేసుకుంటారని చక్కగా చెప్పిందే..