Home Cinema Venu Swamy: ప్రభాస్ సలార్ సినిమా హిట్ ఆ ప్లాప్ ఆ అని చెప్పేసిన వేణు...

Venu Swamy: ప్రభాస్ సలార్ సినిమా హిట్ ఆ ప్లాప్ ఆ అని చెప్పేసిన వేణు స్వామి..

Venu Swamy: ప్రస్తుతం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘సలార్’. గత నెల 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, రీ షూటింగ్స్ కారణంగా డిసెంబర్ 22 వ తారీఖుకు వాయిదా పడింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తూ ఉన్నారు. అక్టోబర్ 23 వ తారీఖున ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నారు(Venu Swamy Prabhas Salaar). ఈ చిత్రానికి మొత్తం రెండు ట్రైలర్స్ ఉంటాయట. మొదటి ట్రైలర్ అక్టోబర్ 23 వ తారీఖున, అలాగే రెండవ ట్రైలర్ దీపావళి పండుగ రోజున విడుదల చేస్తారట.

See also  Janhvi kapoor: వామ్మో ఎన్టీఆర్ లో ఆ కోణాన్ని కనిపెట్టేసిన జాన్వీ కపూర్..

prabhas

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో కూడా నిన్ననే విడుదల తేదీ ని మార్చారు. ఇదంతా పక్కన పెడితే ‘సలార్’ చిత్రానికి ఇప్పుడు వేణు గోపాల స్వామి భయం పట్టుకుంది. ఎందుకంటే గతం లో ఆయన ప్రభాస్ జాతకం అసలు బాగాలేదని, ప్రభాస్ నుండి రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవుతాయని, నిర్మాతలు అనవసరం గా అతని మీద డబ్బులు పెట్టొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అతను చెప్పిన విధంగానే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

See also  Chiranjeevi - Ram Charan : చిరు చరణ్ ల మల్టీ స్టారర్ సినిమా అలాంటి కథతో ఎలాంటి దర్శకుడితోనో తెలిస్తే పూనకాలే..

venu-swamy-prabhas

‘ఆదిపురుష్’ చిత్రం విడుదలకు ముందు కూడా ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నాడు, అలాగే అయ్యింది. ఇప్పుడు సలార్ చిత్రం మీద కూడా ఆశలు పెట్టుకోవద్దు అని వార్నింగ్ ఇస్తున్నాడు(Venu Swamy Prabhas Salaar). ఈ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అవుతుందని, ప్రభాస్ కి కొంత కాలం ఈ ఫ్లాప్స్ తప్పవు అంటూ కామెంట్ చేస్తున్నాడు. దీనిపై కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ వేణు గోపాల స్వామి పై ఫైర్ అవుతుంటే, మరి కొంతమంది ప్రభాస్ ఫాన్స్ మాత్రం భయపడుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ తమ ఆశలన్నీ ఈ చిత్రం పైనే పెట్టుకున్నారు.

See also  Punch Prasad: తీవ్రమైన అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో చేరిన పంచ్ ప్రసాద్.. కన్నీరు మున్నీరవుతున్న భార్య..

prabhas-salaar

అలాంటి సినిమా వాయిదా పడడం, సన్నివేశాలు బాగా రాలేదని రీ షూట్స్ చెయ్యడం, ఇవన్నీ చూస్తుంటే వేణు గోపాల స్వామి చెప్పింది ఈసారి కూడా జరుగుతుందేమో అని భయపడుతున్నారు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి. సలార్ సినిమా ఐతే డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది అని మేకర్స్ తేల్చి చెప్పేసారు. షారుక్ ఖాన్ సినిమాతో సలార్ డిసెంబర్ లో పోటీపడబోతుంది.

సినిమా ట్రైలర్ కోసం రెబెల్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సరి సలార్ ట్రైలర్ పాత రికార్డులను అన్నిటిని బద్దల కొడుతోంది అని రెబెల్ ఫాన్స్ కుండ బద్దలు కొట్టి చెపుతున్నారు. సినిమా మాత్రం హిట్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాము.