Prabhas – Anushka : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ప్రభాస్ మొదటి లిస్టులో ఉంటాడు. ఎప్పటికప్పుడు ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. పెళ్లెప్పుడు అని ఎదురు చూసే దానికంటే కూడా అనుష్కని చేసుకుంటాడా లేదా ఆ శుభవార్త చెప్తాడా లేదా ( Anushka father met Prabhas ) అని ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ప్రభాస్ ఇంక పెళ్లి చేసుకోడేమో అని కూడా కొంతకాలం అనుమానాలు వచ్చాయి కానీ.. ఇటీవల ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, తిరుపతిలో ప్రభాస్ నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అది కూడా తిరుపతిలోనే చేసుకుంటాను అని చెప్పడం వలన అందరూ గుండెల మీద చేతులు వేసుకున్నారు.
ఆరోజు ఏదో అలా చెప్పి తప్పించుకున్నాడు గాని.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి మాట ఎత్తలేదు ప్రభాస్. మళ్లీ అతను సినిమాలో షూటింగులు ఈ గందరగోళం లోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గడియలు దగ్గరికి వచ్చేసాయి. అది కూడా అభిమానులు కోరుకున్నట్టుగా అనుష్కతోనే పెళ్లి జరగబోతుంది అని ( Anushka father met Prabhas ) వార్త హల్చల్ చేస్తుంది. ప్రభాస్ – అనుష్క ప్రేమించుకుంటున్నారా లేదా? వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్సేనా? వాళ్ళిద్దరి మధ్య ఏదీ లేదా ఉందా అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరూ కలిసి బ్రతికేలా పెళ్లి చేసుకుంటే బాగున్ను అని కోరుకునే వాళ్లే తప్పా.. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా అని రీసెర్చ్ చేసే వాళ్ళు లేరు.
ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ అంత బాగుంటుంది. అందుకనే ఆ జంట కలిసి ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన వలన వీళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుందేమో ( Anushka father met Prabhas ) అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదేమిటంటే అనుష్క తండ్రి ప్రభాస్ ని కలవడానికి వెళ్ళాడు అంట. అయితే అతను పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాడా లేదా ప్రభాస్ ఆరోగ్యం బాలేని కారణంగా పలకరించడానికి వెళ్ళాడా అనేది తెలీదు కానీ.. అనుష్క తండ్రి పర్టిక్యులర్ గా ప్రభాస్ దగ్గరికి వెళ్ళాడు అంటే కచ్చితంగా పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్లి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు.
ఈ ఊహల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. అనుష్క తండ్రి వెళ్లి పెళ్లి గురించే మాట్లాడాడో లేదో అనేది అఫీషియల్ గా ఏమి తెలియలేదు గాని.. అభిమానులు మాత్రం ఆనందంతో పొంగిపోతున్నారు. ఇక ప్రభాస్ శివుడు పాత్ర చేస్తాడంటేనే శివుడుగా టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసి ఫోటోలు విపరీతంగా షేర్ చేసిన వీళ్లు.. ఇప్పుడు అనుష్క- ప్రభాస్ల పెళ్లి శుభలేఖలు కూడా వీలైతే తయారు చేసేసి ఆన్లైన్లో వదిలేంత ఆనందంగా ఉన్నారు. ఏమో చూడాలి మరి ప్రభాస్ పెళ్లి ఎవరితో, ఎప్పుడు జరుగుతుంది అనేది ఎదురు చూస్తూ ఉండడమే. ఇక ప్రభాస్ సినిమా సలార్ డిసెంబర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే అనుష్క సినిమా ఇటీవల రిలీజ్ అయిన.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి రిజల్ట్ ఇచ్చింది.