Home Cinema Sreeleela : శ్రీలీల ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే..

Sreeleela : శ్రీలీల ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే..

comments-on-sreeleela-about-her-movie-selection

Sreeleela : సినిమా ఇండస్ట్రీలో నటీనటులు అడుగుపెట్టి సక్సెస్ అయ్యి.. ఎక్కువ కాలం జర్నీ చేయాలంటే నిజంగా వాళ్లలో ఒక ప్రతిభ, సినిమాల మీద అంత ఇష్టం, భక్తి, గౌరవం, అదృష్టం అన్నీ కలిసి రావాలి. ముఖ్యంగా ( Sreeleela about her movie selection ) ఆడవాళ్లు హీరోయిన్స్ గా సినిమా రంగంలో అడుగుపెడితే.. వాళ్ళ అదృష్టం బాగుంటే.. ట్యాలెంట్ ఉంటే స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలగడానికి ఎంతో టైం పట్టదు. అలాగే ఇటీవలశ్రీలీల అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ ప్రాజెక్టులు సైన్ చేసి.. ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన సినిమాలను ఒప్పుకుంది.

Sreeleela-movies-selection

శ్రీలీల అంటే ఇప్పుడు యూత్ లో చాలా క్రేజ్ ఉంది. కేవలం సామాన్య ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సినిమా రంగంలో వాళ్ళకి కూడా శ్రీలీల మీదే ఇష్టం ఉంది. ముఖ్యంగా హీరోలు తమ సినిమాలో మొదటి లేక రెండో హీరోయిన్గా ( Sreeleela about her movie selection ) అయినా శ్రీలీలనే పెట్టమని అడిగే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఆమె డిమాండ్ ఆకాశాన్ని అంటుతుంది. ఏకంగా 12 సినిమాలు ఆమె చేతిలో ఇంకా ఉన్నాయని అంటున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల పాటు ఆమె ఒక వెలుగు వెలుగుతోంది అనేది అర్థమవుతుంది. శ్రీలీల వచ్చిన తరవాత చాలామంది హీరోయిన్స్ కి ఆఫర్స్ తగ్గిపోయాయి.

See also  Keerthy Suresh Birthday : కీర్తి సురేష్ పుట్టినరోజు నాడు ఆమె లవర్ ఎవరో తెలిసిపోయింది..

Sreeleela-movies

స్టార్ హీరోయిన్స్ ని సైతం పక్కకి నెట్టి వాళ్ల ఆఫర్స్ ని గుటుక్కుమని లాగేసుకుంటుంది శ్రీలీల. అయితే సినిమాలు వరుసగా హిట్స్ అవడంతో ఆమెకు అన్ని రకాలుగా కలిసి వచ్చింది. కాకపోతే ఇటీవల రిలీజైన స్కంద సినిమాలో మాత్రం ( Sreeleela about her movie selection ) ఆమె కేవలం గ్లామర్ రోల్ కి సొంతం అయ్యింది. స్కంద సినిమాలో శ్రీలీల పాత్రను చాలా ఎక్కువగా ఊహించుకున్నారు అభిమానులు.. కచ్చితంగా ఆమెకు మంచి పాత్ర ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే పోస్టర్స్ లో కానీ ఎక్కడ చూసినా ఆమె అట్రాక్టివ్ గా కనిపించింది. అయితే సినిమాలో మాత్రం ఆమె పాత్రకి పెద్ద వెయిట్ లేదు.

See also  Suma : నోరు జారిన సుమకి జర్నలిస్ట్ వార్ణింగ్ ఇవ్వగానే సుమ ఎం చేసిందంటే..

Sreeleela-comments-on-movie-selection

పైగా స్కంద సినిమా మిక్స్డ్ టాక్ కొంత.. ఫ్లాప్ టాక్ కొంత తెచ్చుకుంది. దానితో అందరి దృష్టి శ్రీలీల మీద పడింది. శ్రీలీల సినిమాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు సరిగ్గా ఆలోచించి ఒప్పుకోవాలని.. ఏ సినిమా వచ్చినా గబగబా ఒప్పేసుకుని డబ్బు కోసం చేయకూడదని.. డబ్బు వచ్చేస్తుంది కదా అని చూసుకుంటే చాలా తొందరగా ఇండస్ట్రీ నుంచి దూరం అవ్వాల్సి వస్తుందని.. అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, తన పాత్రకు ఒక వేల్యూ ఉన్న సినిమాలు ఒప్పుకుంటే.. ఒక మంచి నటిగా ఎక్కువకాలం సినిమాల్లో జర్నీ చేస్తుందని.. శ్రీలీలకు అనేకమంది సలహాలిస్తున్నారు.