Home Cinema Balakrishna – Jr NTR : బాలకృష్ణ అన్న అంత పెద్ద మాటకు జూనియర్ ఎన్టీఆర్...

Balakrishna – Jr NTR : బాలకృష్ణ అన్న అంత పెద్ద మాటకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం..

balakrishna-and-jr-ntr-fight-about-chandrababu-naidu-arrest

Balakrishna – Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వంశం నుంచి దివంగత సీనియర్ నందమూరి తారకరామారావు గారి తర్వాత బాలకృష్ణ, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇలా ముఖ్యమైన వారు ఒక్కొక్కరు మూడు తరాల్లో నిలబడ్డారు. దివంగత నందమూరి తారక రామారావు గారు ఆయన సినిమా రంగంలో ఎంత (Balakrishna and Jr NTR ) ఖ్యాతిని సంపాదించారో.. అంతకంత రాజకీయాల్లో కూడా సంపాదించారు. స్వయంగా ఆయన ఒక తెలుగుదేశం పార్టీ అని ఒక పార్టీని పెట్టి దాని ద్వారా తెలుగువారికి ఇంకా దగ్గర అయ్యి వాళ్ల గుండెల్లో చిరస్మరణీయంగా నిలబడిపోయారు. అలాంటి నందమూరి తారకరామారావు గారి పార్టీని తర్వాత కొన్ని కారణాల వలన చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది.

Balakrishna-JrNTR-comments

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం వలన అక్కడ వాతావరణం అంతా వేడిగా మారింది. కొందరు చంద్రబాబునాయుడు కి సపోర్ట్ వస్తే.. మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడితే.. ఇంకొందరు ( Balakrishna and Jr NTR ) సైలెంట్ గా ఉండే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు సపోర్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ నిలబడి ఆయన కోసం పోరాడుతున్నారు. అలాగే టిడిపిని బాలకృష్ణ భుజాల మీద వేసుకొని తీసుకువెళ్తున్నారు.

See also  Niharika - Lavanya Tripathi : నిహారిక వల్ల లావణ్య జీవితం అలా కాబోతుందా!

Balakrishna-JrNTR-comments-viral

ఇవన్నీ సహజమే బాగానే ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరూ కూడా స్పందించడం లేదు. పాజిటివ్గా కాని నెగిటివ్గా కాని పెద్దగా ఏది అనకుండా సైలెంట్ గా ఉంటున్నారు. సినిమా రంగం నుంచి ఎవరు స్పందించినా, స్పందించకపోయినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం అందరూ ( Balakrishna and Jr NTR ) ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కామ్ గా తన షూటింగ్ తన పని చూసుకుంటున్నాడు. అయితే బాలకృష్ణ ఇటీవల ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  Madhavi Latha: బాలకృష్ణ సినిమా పై మధివిలత చేసిన సంచలన కామెంట్స్ కి మీనింగ్ అదా?

Balakrishna-comments-on-JrNTR

బాలకృష్ణ ఇటీవల హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి.. అందులో జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ మీద సినీ ప్రముఖులు ఎవరు మాట్లాడకపోయినా పట్టించుకోనని అంటూ.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా కూడా డోంట్ కేర్ అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ని పట్టుకొని డోంట్ కేర్ అని బాలకృష్ణ కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.జూనియర్ ఎన్టీఆర్ స్పందించవచ్చు కదా అని కొందరు అంటుంటే.. మరికొందరు స్పందించకపోవడం కరెక్ట్ అని అంటున్నారు. ఏదేమైనా ఇన్ని జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సమాధానమైతే మౌనమే. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించకుండా తన సినిమా షూటింగ్, తన లోకంలో మునిగిపోయి పని చేసుకుంటూ ఉన్నాడు. అతనికి స్పందించాలనిపించినప్పుడు అతనికి ఏది మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతాడు గాని వీళ్ళ స్పందించమంటే ఎందుకు స్పందిస్తాడు అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం అయితే మౌనమే..