Skanda : యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరోగా పేరుపొందిన హీరో రామ్ పోతినేని గత కొంతకాలంగా డల్ అయిపోయాడు. దానికి కారణం.. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన సినిమా తర్వాత రెడ్, ది వారియర్ లాంటి డిజాస్టర్ ( Skanda First Day Collection ) సినిమాలు చేయడం వలన ప్రేక్షకుల ఆదరణ నుంచి చాలా దూరం అయ్యాడు. అభిమానులు కూడా నిరాశ చెందటంతో తమ హీరోకి మంచి హిట్ మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే రామ్ మాత్రం ఎక్కడ నిరాశ పడకుండా తనకు మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎంత బాగా మంచి ప్రాజెక్ట్‌ను పట్టుకోవాలి అంటూ తనని తాను స్ట్రాంగ్ చేసుకున్నాడు.
అదే క్రమంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా ప్రాజెక్టు తన దగ్గరకు వస్తే.. అది రామ్ తనకి ఎంత పర్ఫెక్ట్గా అవుతుంది అని ఆలోచించి వెంటనే తెలివిగా ఆ ప్రాజెక్ట్ ని ఒప్పుకున్నాడు. ఇప్పటికే రెడ్, ది వారియర్ ( Skanda First Day Collection ) సినిమాల్లో ఫ్లాప్ అయినప్పటి.. రామ్ ఈసారి మాత్రం మంచి ప్రాజెక్ట్‌నే ఎన్నుకున్నాడు అని అభిమానులు అనుకునేలా ఉంటాదా? ఉండదా? అని సినిమా రిలీజ్ కి ముందు అందరూ భయంతో ఉన్నారు. కానీ సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కందా సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది.
ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రామ్, శ్రీలీల, మంజ్రేకర్ తో పాటు శ్రీకాంత్, పృద్వి రాజ్,ప్రిన్స్ సీసల్, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ( Skanda First Day Collection ) మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అని అందరిలోని ఆత్రం ఉంది. ఎందుకంటే.. సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది కానీ.. దాని ఫస్ట్ ఏ కలెక్షన్స్ ఎలా ఉన్నాయని దానిపై అందరి దృష్టి ఉంటుంది. ఇక స్కంద సినిమా ఫస్ట్క డే లెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం. స్కంద సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజు 8.62 కోట్ల షేర్ని రాబట్టింది. అలాగే 13.5 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.
ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 3.23 కోట్లు, సీడెడ్ లో 1. 22 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.19 కోట్లు, తూర్పు గోదావరిలో 59 లక్షలు. పశ్చిమ గోదావరిలో 41 లక్షలు, గుంటూరులో 1.4 కోట్లు, కృష్ణాలో 45 లక్షలు, నెల్లూరులో 49 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో చూస్తే 1.05 కోట్లు వచ్చాయి. ఇక స్కంద మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 10.57 కోట్లు షేర్ వచ్చింది. అలాగే 17.20 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఇది ఈ సినిమా బ్రేకింగ్ అవ్వాలంటే 47 కోట్లను రాబట్టాలి అంటే ఇంక ఈ సినిమాకి 36.43 కోట్లు వసూలు వస్తే బ్రేక్వెన్ అవుతుంది. అయితే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం వలన.. అలాగే వీకెండ్ కూడా సెలవులు కూడా బాగానే ఉండడం వలన కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని అభిమానులు ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు.