Nagarjunas Lakshmi: అక్కినేని నాగార్జున దగ్గుబాటి లక్ష్మి వివాహం కుటుంబం కుదిర్చిన వివాహం కాగా వీళ్ళ విడాకులకు కారణం ప్రస్తుతం అక్కినేని నాగార్జున భార్య అమల అంటూ ఇప్పటికీ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో వైరల్ సంగతిగా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లయిన నాగార్జున తో సినిమా లలో కి వచ్చాక అమల తో ప్రేమలో పడి భార్యకు దూరంగా ఉండి అమల పై విపరీతమైన మోజు పెంచుకునే ఆ మోజులో తనను తానే మరిచిపోయేంతలా అమలతో తిరుగుతూ కట్టుకున్న భార్యని మర్చిపోయి చివరికి దగ్గుబాటి లక్ష్మి విడాకులు ఇచ్చి నాగార్జున లక్ష్మీ దూరమవ్వడానికి కారణం అమల అంటూ అప్పట్లో ఎన్నో రకాల వార్తలు కుప్పలు తెప్పలుగా వైరల్ అయ్యాయి. ఐతే ప్రస్తుతం అసలు విషయం బయటకు వచ్చింది వీళ్ళిద్దరూ వీడిపోవడానికి కారణం అమల కాదట. మరొక స్టార్ హీరోయిన్ అట. మరి ఆ హీరోయిన్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..
సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందే అక్కినేని నాగార్జున బీభత్సంగా పబ్బులు పార్టీలు అమ్మాయిలు అంటూ తెగ ఎంజాయ్ చేసేవాడట. ఆ కారణం చేతనే వీడు ఏమైపోతాడో అని ఏఎన్నార్ సినిమా లలో అడుగు పెట్టక ముందే పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేశాడు. ఇక ఈయన మొదట చేసిన చిత్రం విక్రమ్ సినిమా ఓకే అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ నాగార్జున ఫ్లాప్ గా మిగిలింది. కానీ ఆ తర్వాత రజిని నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన మజ్ను చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అవడంతో నాగార్జున కి లేడీస్ మాన్ అయిన నాగార్జున రజిని ల మధ్య మంచి ఏర్పడింది.
అయితే రజినీ కి మంచి చెడు చెప్పే వారు ఎవ్వరు లేకపోవడం తో పెళ్లైన నాగార్జున తో చాలా కలిమెలియగా ఉంటూ వచ్చింది. అలా ఉన్న క్రమంలోనే వీళ్ళిద్దరూ కలెక్టర్ గారి అబ్బాయి, అగ్ని పుత్రుడు, మురళీ కృష్ణుడు వంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల లో నటించసాగారు. ఇక అగ్నిపుత్రుడు సినిమా యొక్క సమయంలో వీరిద్దరూ ఎఫైర్ కొనసాగిస్తున్నారు అనే విషయం రామానాయుడు కి తెలియడంతో తన కూతురు జీవితం ఎక్కడ నాశనం అవుతుందన్న ఉద్దేశం తోనే దాసరి నారాయణరావుకి రజిని గురించి చెప్పి పెద్ద లొల్లి పెట్టించి మరి నాగార్జునని వదిలేయకపోతే సినిమా ఇండస్ట్రీ లలో నీ బతికే ఉండదని బెదిరించి దాసరి నారాయణ స్వయంగా ఆమెకు వార్నింగ్ ఇచ్చాడట.
దాంతో భయపడి పోయిన రజిని మురళీకృష్ణుడు సినిమా తర్వాత నాగార్జునకి (Nagarjunas Lakshmi) దూరంగా వెళ్లిపోయిందట. అప్పటినుండే నాగార్జున లక్ష్మి మధ్య గొడవలు తలెత్తుతూ వచ్చాయట. అదే సమయంలో నాగార్జున రజిని మర్చిపోయి కిరాయి దాదా సినిమాలో అమలతో ప్రేమలో పడి మునిగిపోయాడట చివరికి లక్ష్మితో గొడవలు పెద్దదై పెద్దదై ఆ తర్వాత విడాకుల వరకు వెళ్లి చివరికి వీళ్లిద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు.