Skanda First Review : రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కందా సినిమా ఇంకొన్ని గంటల్లో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై సినీ అభిమానులందరికీ మంచి ( Skanda movie first review ) అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, మురళీ శర్మ, రవి ప్రకాష్ మొదలగు వారు నటించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ కి జోడిగా శ్రీలీల మరియు సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు.
స్కంద చిత్ర బృందం వారు రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఒక రకమైన ఆసక్తిని రేపింది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్ కోసం రామ్ విపరీతంగా తిరిగాడు. అతను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా ( Skanda movie first review ) స్కంద సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. అదొక అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఓవర్సీస్లో ప్రీవియర్ షో లు వేశారు. అక్కడ నుంచి ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చింది. మరి స్కంద సినిమాపై వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
స్కంద సినిమా చూసిన అభిమానులు, మీడియా మిత్రులు కొంతమంది వాళ్ళు ఇస్తున్న రివ్యూ ప్రకారం.. ఎక్కువగా సినిమాపై పాజిటివ్ టాకే వస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం చేసిన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా ఇంకా ( Skanda movie first review ) ఒక ఎత్తు ఎదిగినట్టు ఉంటుందని అంటున్నారు. అలాగే రామ్ పోతినేని కూడా హీరోగా తన లెవెల్ ని ఇంకా కొంచెం పైకి పెంచుకోలేనట్టుగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందని.. ఇంటర్వెల్ బ్యాంగ్ వలన సెకండ్ హాఫ్ పై ఇంకా అంచనాలు పెరిగి కుతూహలంగా సినిమాలు చూస్తారని అంటున్నారు.
అయితే ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శ్రీలీల ఇద్దరు హీరోయిన్స్ గా ఉన్నా కూడా ఇద్దరూ గ్లామర్ షో కి మాత్రమే పరిమితమయ్యారంట. బోయపాటి శ్రీను వీళ్ళకి పెద్ద ప్రాధాన్యపరమైన క్యారెక్టర్స్ ఇవ్వలేదని అంటున్నారు. సినిమా స్టోరీ పెద్ద కొత్తగా లేకపోయినా.. రొటీన్ గానే అనిపిస్తుంది కానీ.. తీసే విధానం వల్ల, ప్రతి సీన్ ని చాలా జాగ్రత్తగా రక్తి కట్టేలా తీయడం వలన.. సినిమా బాగుంటుందని అన్నారు. సినిమా క్లైమాక్స్ 20 నిమిషాలు కూడా అదిరిపోతుందని అన్నారు. క్లైమాక్స్ ముందు 20 నిమిషాలు కూడా అందరికీ పూనకాల రావడం ఖాయం అని అంటున్నారు. అయితే సినిమాలో డ్రా బ్యాక్స్ అనేవి లేకపోవడం లేదని.. కొన్ని డ్రాబాక్స్ ఉన్నప్పటికీ కూడా.. బోయపాటి శ్రీను జాగ్రత్తగా ఈ సినిమాని సక్సెస్ వైపు నడిపించేలా తీగలిగాడని అంటున్నారు. మరి ఈ రివ్యూ ఎంతవరకు నిజమో.. సినిమా అసలు ఎలా ఉంటుంది అనేది.. రేపు మార్నింగ్ షో చూసిన తర్వాత ఆడియన్స్ ఇచ్చే రిజల్ట్ ని బట్టి తెలుస్తుంది.