Home Cinema Prabhas – Shah Rukh Khan : ప్రభాస్ షారుఖ్ మధ్య ఇంత పెద్ద గొడవ...

Prabhas – Shah Rukh Khan : ప్రభాస్ షారుఖ్ మధ్య ఇంత పెద్ద గొడవ అవసరమా?

prabhas-and-shah-rukh-khan-latest-news-about-their-fight

Prabhas – Shah Rukh Khan : ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా గురించి ప్రభాస్ అభిమానులు అందరూ ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదట సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అవుతుందని అన్నారు. కానీ ( Prabhas and Shah Rukh Khan ) విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేయడం జరిగిందని చిత్ర బృందం వారు చెప్పారు. కేజిఎఫ్ లాంటి సినిమా తీసిన ప్రశాంత్ నీలిపై అందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలాగే బాహుబలి సినిమా తర్వాత సరైన హిట్స్ లేక సతమవుతమవుతున్న ప్రభాస్ అభిమానులకు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ పై ఎంతో భరోసా ఉంది..

Prabhas -Shahrukh- khan

ఒక్కసారి వీళ్లిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని.. వాళ్ళ హీరో మరొక సంచలనాన్ని క్రియేట్ చేయాలని.. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మరొక వార్త ప్రభాస్ ( Prabhas and Shah Rukh Khan ) అభిమానుల్ని భయపెడుతుంది. అదేంటంటే.. షారుఖ్ ఖాన్ సినిమా డంకి. షారుఖ్ ఖాన్ హీరోగా, తాప్సి హీరోయిన్ గా, రాజ్ కుమార్ హరిని దర్శకత్వంలో రూపొందుతున్న డంకీ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఎందుకంటే షారుక్ ఖాన్ హవా ఇప్పుడు చాలా బాగుంది. పఠాన్, జవాన్ సినిమాలతో వెయ్యి కోట్ల కలెక్షన్ కి ఎదిగిపోయాడు.

See also  Mega Hero : విషాదంలో ఉన్న ఆ మెగా హీరోని ఇలా ఓదారుస్తూ మెగా ఫామిలీ..

Prabhas -Shahrukh- khan-latest

అలాగే త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబిబిఎస్, పీకే.. ఇలాంటి సినిమాలు తీసిన రాజకుమార్ హిరానీ అంటే కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈయన సినిమా అంటేనే 90% సక్సెస్ అవుతుందని అందరి ఆలోచనలు. ఒకవేళసినిమా ఎలా ఉన్నా కూడా ఆయన సినిమాని అభిమానులు వదిలిపెట్టరు. ఒక్కసారి చూసైనా ఎందుకు బాలేదు ( Prabhas and Shah Rukh Khan ) అనే విషయం తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి కాంబినేషన్ లో షారుఖ్ ఖాన్ – రాజకుమార్ హరిని కలిపి డంకీ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే ఒక విభిన్నమైన కథలా అనిపిస్తుంది. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. విపరీతమైన కలెక్షన్స్ తెచ్చి పెడుతుందని అనిపిస్తుంది.

See also  Tharaka Ratna: తారకరత్న ఇంకా స్పృహలోకి ఎందుకు రాలేదు.. బయటపడ్డ అసలు నిజాలు..

Prabhas -Shahrukh- khan-latest-news

అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఒక్కటే..ప్రభాస్ హీరోగా చేస్తున్న సాలార్ సినిమా సెప్టెంబర్ లో వాయిదా పడి డిసెంబర్లో రిలీజ్ సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్, దాని వెంటనే న్యూ ఇయర్ హాలిడేస్ కలిపి అందరూ హుషారుగా ఉంటారు. అలాంటి క్రమంలో విడుదలైన సినిమాలు కొంచెం బాగుంటే.. చాలా చాలా బాగా క్లిక్ అయిపోతాయి. ఇప్పుడు సలార్ సినిమా కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తారని అంటున్నారు. అలాగే డంకీ సినిమా కూడా డిసెంబర్ క్రిస్మస్ టైంలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ కి షారుక్ ఖాన్ కి మధ్య జరిగే ఈ ఫైట్ లో ఎవరు విన్ అవుతారు? ఎవరు నిలబడతారు అనేది మరి ప్రభాస్ అభిమానులైతే.. షారుక్ ఖాన్ టైమ్ అసలే బాగుంది.. పైగా ఆ దర్శకుడికి కూడా మంచి క్రియేట్ ఉంది. ప్రభాస్ సినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ అయితే బాగున్ను.. లేదా జనవరిలో రిలీజ్ అయితే బాగుంటుంది. ఇలా వీళ్ళిద్దరి పోటీ ఇప్పుడు అవసరమా అని అనుకుంటున్నారు. మరోపక్క సినిమాలు రెండు బాగుంటే రెండు బానే ఆడతాయి.. ఒకటి బాగుందని ఒకటి వదిలేయరు. సో వాళ్ళిద్దరూ పోటీపడిన నష్టం లేదు.. సత్తా ఉన్న సినిమా నిలబడుతుందని సామాన్య సినీ అభిమానులు అనుకుంటున్నారు.