Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా గురించి మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ( Mahesh Babu and Rajamouli movie ) త్రివిక్రమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడని.. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్కు స్టైల్ అన్నీ కూడా అదిరిపోతున్నాయని ఎప్పటికప్పుడు వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు అంతగా ఆరాటపడడానికి కారణం.. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయేది రాజమౌళితో సినిమా చేస్తున్నాడు అన్న సంగతి మన అందరికీ తెలిసిందే..
ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేయబోతున్న సినిమా ఇదే. మహేష్ బాబుతో రాజమౌళి మొదటిసారిగా సినిమా చేస్తున్నారు. అయితే అందుకే ఈ సినిమాపై అందరికీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని ( Mahesh Babu and Rajamouli movie ) హాలీవుడ్ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకునేలా సినిమాని తీర్చిదిద్దుతున్నాడు అన్న సంగతి రాజమౌళి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇక రాజమౌళితో సినిమా అంటే ఆయనకే పూర్తిగా అంకితభావంతో పనిచేయాలన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళితో సినిమా చేస్తున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే సినిమా గురించి చేయడమే కాదు ఆలోచించకూడదన్న విషయం కూడా తెలిసిందే.
అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు ఏదో కారణాల వలన బ్రేక్ వస్తూ ఉంది. ఈ సినిమాని సంక్రాంతి పండగకి విడుదల చేయాలని ఎంతగానో ట్రై చేస్తున్నారు. మరి అది కూడా చేయగలరా లేదా అనేది అర్థం కావడం లేదు. అయితే దాని తర్వాత రాజమౌళి సినిమా కూడా స్టార్ట్ అవ్వాలంటే. టైం పట్టేలా ఉంది. రాజమౌళికి ( Mahesh Babu and Rajamouli movie ) త్రివిక్రమ్ సినిమాకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది. అయితే మహేష్ బాబు ఆ దొరికిన కొంచెం గ్యాప్ ని వదులుకోవాలని అనుకోవడం లేదంట. ఆ గ్యాప్ లో వేరే సినిమా ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటున్నాడంట. ఈ వార్త అఫీషియల్ గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ జరగలేదు కానీ చిత్ర రంగంలో అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదే నిజమైతే మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాజమౌళికి మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత సంపూర్ణంగా తన హీరో అవుతాడనే ఆయన ఎస్టిమేషన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే రాజమౌళి ఒక సినిమా తీయాలంటే హీరో డేట్స్ షూటింగ్ కోసం మాత్రమే కాదు.. పర్సనాలిటీని, భాషని, అన్ని స్టైల్స్ ని తీర్చిదిద్దిన తరవాత షూటింగ్ మొదలు పెడతాడు. అలాంటి క్రమంలో ఆ గ్యాప్ ఏమైనా వస్తే.. అది మహేష్ బాబుని ఆ పాత్రకు తగ్గట్టు తీర్చిదిద్దడానికి వాడతారు తప్పా.. ఇలా వేరే సినిమా చేస్తే.. ఊరుకునే పరిస్థితి ఉండదనే అందరూ అనుకుంటున్నారు. ఇలా రాజమౌళికి వ్యతిరేకంగా మహేష్ బాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నష్టం ఎవరికి? సినిమా ఏమైనా తేడా అయితే అది మహేష్ బాబుకె కదా అని మరికొందరు అంటున్నారు. ఏమో అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ నిజమే అయితే మాత్రం అలాంటి నిర్ణయం అనవసరం అని అనుకుంటున్నారు.