Home Cinema Ram Charan : రామ్ చరణ్ కి అలాంటి ప్రయోగం అవసరమా? వాళ్లకి మాత్రం టెన్షన్...

Ram Charan : రామ్ చరణ్ కి అలాంటి ప్రయోగం అవసరమా? వాళ్లకి మాత్రం టెన్షన్ గానే ఉందట!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రేత్యేక స్థానాన్ని సినిమా ఇండస్ట్రీలో తెచ్చుకున్నారు. 13 సినిమాలు చేస్తే అందులో నాలుగు సూపర్ హిట్స్ అయితే, 3 సినిమాలు ఇండస్ట్రీ హిట్ ని కొట్టాయి. ఎప్పటికప్పుడు రామ్ చరణ్ తన ట్యాలెంట్ నిరూపించుకునేందుకు ఒకేలాంటి పాత్రలు కాకుండా, కొత్త కొత్త పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ, తనలో ఉన్న నటనా నైపుణ్యాన్ని చూపిస్తూ వచ్చాడు.

రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి దర్శకత్వంలో రెండు సినిమాలను చేసి, అవి ఇండస్ట్రీ హిట్ కొట్టడం వలన చరణ్ సినిమాలపై భారీ అంచనాలు ఉండటం సహజం. రామ్ చరణ్ నటించిన సినిమాలు ఎన్ని ఎంత హిట్ అయినప్పటికీ అందులో మగధీర, రంగస్థలం సినిమాలు మాత్రం ఇండస్ట్రీ గాని, సినీ అభిమానులు గాని మరచిపోలేరు. జక్కన్న చెక్కిన సైన్యాధ్యక్షుడిగా చరణ్ అద్భుతంగా నటించాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం సినిమాలో చెవిటి పాత్రలో అద్భుతంగా రామ్ చరణ్ నటించాడు. 

See also  Samantha : సమంత సడన్ గా అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అంత ప్రమాదం ఉందా?

Ram Charan and Buchi Babu next movie

ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో రామ్ చరణ్ నత్తి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ నత్తి పాత్రకి ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి, చరణ్ నత్తి పాత్ర చాలా హైలెట్ అవుతాదని అంటున్నారు. అలాగే ఈ సినిమా తరవాత చేసే సినిమాలో గుడ్డివాడిగా నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమాకి ఉప్పెన దర్శకుడు ఫేమ్ బుచ్చి బాబు దర్శకతం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కు ఉన్న మంచి ఫేమ్ కి ఇలాంటి పాత్రల ప్రయోగాలు చేయడం అవసరమా అని సినీ అభిమానులు అనుకుంటున్నారు. మెగా అభిమానులకు అయితే ఇలాంటి పాత్రలు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో అని టెంక్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది.