Home Cinema Janhvi Kapoor : జాన్వీ కపూర్ మీద తన అభిప్రాయాన్ని.. పచ్చిగా బయట పెట్టిన బోనీకపూర్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్ మీద తన అభిప్రాయాన్ని.. పచ్చిగా బయట పెట్టిన బోనీకపూర్..

boney-kapoor-expressed-his-opinion-on-janhvi-kapoor

Janhvi Kapoor : దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. జాన్వీ కపూర్ సినిమా లిస్టులో బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోయినా.. అన్ని భాషల్లోనూ ఆమె క్రేజ్ మాత్రం ( Janhvi Kapoor and Boney Kapoor ) అలానే ఉంది. ఇది ఇలా ఉంటే తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్కి హీరోయిన్ గా జాన్వి కపూర్ తొలిసారిగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఎలా నటిస్తుంది? ఆ సినిమా ఎంత హిట్ అవుతుంది అనే విషయం పక్కన పెట్టి మరి.. ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటిస్తుంది అనగానే ఆమెకు ఆఫర్లు అదిరిపోయేలా వస్తూనే ఉన్నాయి.

Jahnvi-Kapoor-Boney-Kapoor-news

ఎప్పుడైతే జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగు పెట్టిందో.. అప్పటినుంచి ఎంతోమంది ఎన్నో ఆఫర్స్ ఇస్తున్నారు. అయితే జాన్వి కపూర్ మాత్రం ఆచితూచి అడుగు వేస్తుంది. తనకి ఆ పాత్ర నచ్చితేనే చేస్తుంది. జాన్వి కపూర్ ( Janhvi Kapoor and Boney Kapoor ) ఒక సినిమా ఒప్పుకోవాలి అంటే కేవలం ఆమె నిర్ణయం మాత్రమే కాకుండా, ఆమె తండ్రి బోనీకపూర్ నిర్ణయం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఆయనకు ఆ సినిమా, ఆ సినిమాకి వాళ్ళు ఇచ్చే రెమ్యూనరేషన్, అందులో తన కూతురి పాత్ర అన్ని నచ్చితే డేట్స్ అనేవి దొరుకుతాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో జాహ్నవి కపూర్ పై ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది.

See also  Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ భార్య గురించి బయటపడ్డ నిజాలు

Jahnvi-Kapoor-Boney-Kapoor-opinion

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా పుష్ప రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా ఒక కొత్త రకం ట్రెండు ని, సంచలనాన్ని క్రియేట్ చేసింది. దానితో సుకుమార్ పుష్ప 2 సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుతున్నాడు. పుష్ప సినిమాతో ఇప్పటివరకు తెలుగు సినిమా ( Janhvi Kapoor and Boney Kapoor ) ఇండస్ట్రీ సంపాదించుకొని బెస్ట్ నేషనల్ యాక్టర్ కూడా అల్లు అర్జున్ సంపాదించుకోవడం జరిగింది. అందుకని పుష్ప 2 సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అలాగే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ సమంత చేయగా అది ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

See also  Ugram Trailer : లాక్‌డౌన్‌లో మిస్ అయిన ఈ రియల్ స్టోరీ ఆధారంతో అదరగొట్టాడు.. అందులో మీరున్నారా?

Jahnvi-Kapoor-Boney-Kapoor-sukumar

పుష్ప 2 సినిమాలో కూడా ఐటెం సాంగ్ మీద అందరి కన్ను ఉంది. అయితే సుకుమార్.. బోనీ కపూర్ దగ్గరికి వెళ్లి పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కోసం జాన్వీ కపూర్ ని అడిగాడంట. ఈ విషయంలో సుకుమార్ ధైర్యానికి మెచ్చుకోవచ్చు మరి. సుకుమార్ అడిగి అడగగానే బోణీ కపూర్ ఇలా రియాక్ట్ అయ్యాడు అంట. అసలు నా కూతురు మీద నీకున్న అభిప్రాయం ఏమిటి? ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి.. తన కెరీర్ ని స్ట్రాంగ్ గా పాతుకుంటున్న నా కూతుర్ని.. ఐటమ్ గర్ల్ గా చూపించమని అడుగుతున్నారు అంటే మీ అభిప్రాయం అర్థం అవుతుంది. కానీ నా కూతురుతో నేను అలాంటి సాంగ్స్ చేయించను.. కేవలం హీరోయిన్ పాత్రలో.. అది కూడా నాకు నచ్చిన హీరోతో సినిమా.. సినిమాలో అన్ని రకాలుగా బాగుంటేనే నా కూతురుతో ఆ సినిమాను ఒప్పుకునేలా చేస్తానని.. ఇక మీరు సెలవు తీసుకోవచ్చని సుకుమార్ తో పచ్చిగా, గట్టిగా చెప్పేసాడు అంట.