Home News Unstoppable with NBK: పవన్ కళ్యాణ్ ఒక్క ఎపిసోడ్ ద్వారా ఆహా మీడియా కి అన్ని...

Unstoppable with NBK: పవన్ కళ్యాణ్ ఒక్క ఎపిసోడ్ ద్వారా ఆహా మీడియా కి అన్ని కోట్లు వస్తాయా.

Unstoppable with NBK: అన్ స్టాపబుల్ విత్ NBK అనేది తెలుగు భాష వెబ్ టెలివిజన్ షో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇది 2021 నవంబర్ 4వ తారీఖు నుంచి ఆహా మీడియాలో మొదలైంది. మొదటి సీజన్ 40 కోట్ల కంటే ఎక్కువ స్ట్రీమింగ్ నిమిషాలతో ఆహాలో అత్యధికంగా వీక్షించబడిన షోగా నిలిచి భారతదేశ చరిత్రలో IMDb టాప్ రేటింగ్ షో ర్యాంకును చేరుకుంది. రెండవ సీజన్ మొదటి సీజన్ కి మించి సూపర్ డూపర్ హిట్టయ్యింది.

See also  Pawan Kalyan: మొదటిసారి మూడు పెళ్లిళ్ల గురించి అసలు విషయం బయటపెట్టిన పవన్ కళ్యాణ్…

టాలీవుడ్ స్టార్ హీరోలతో బాలయ్య చేసే చిట్ చాట్ ప్రేక్షకుల నుండి అపూర్వమైన స్పందన లభించింది. ఇవాళ పవన్ కళ్యాణ్ విత్ అన్ స్టాపబుల్ NBK ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. గతంలో ప్రభాస్ ఎపిసోడ్ వచ్చినప్పుడు లక్షల్లో యూజర్లు ఆహా యాప్ ఓపెన్ చేయడం వల్ల సర్వర్ క్రాష్ అయ్యింది. ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఆహా మీడియా టీం తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహా మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ సారి యాప్ క్రాష్ కాకుండా ఉండేందుకు సర్వర్ బ్యాండ్ విడ్త్ పెంచడంతోపాటు, మూడు బ్యాకప్ సర్వర్లను కూడా రెడీ చేసుకున్నారట.

See also  తొలి సినిమాతో చిత్ర పరిశ్రమలో పాతుకుపోయిన హీరోయిన్లు వీళ్ళే

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అప్లోడైన గంటలోనే 20 లక్షలు వ్యూస్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆహా మెంబర్షిప్ కావాలంటే 199 రూపాయలు అవుతుంది ఇప్పటికే చాలామంది దగ్గర ఆహా ఉండొచ్చు అలాగే కొత్త యూజర్లు కూడా రావచ్చు అవన్నీ కలుపుకొని కేవలం గంట వ్యవధిలో పదిహేను కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ ఎపిసోడ్ వచ్చినప్పుడు సర్వర్ క్రాష్ అయ్యింది ఇప్పుడు అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు కనుక ఇవాళ విడుదలవుతున్న ఈ షో ఇండియా మొత్తంలో గత షోల కంటే చరిత్ర తిరగరాస్తుందని సంచలనం సృష్టించబోతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.