Hero Nani : ఒక వ్యక్తి కెరీర్ అనేది మొదలైన తర్వాత ఆ రంగంలో ఎప్పుడు ఎటువైపు ఎలా వెళ్తాడు, ఎలా నిలబడతాడు అనేది ముందుగా అంచనా వేయలేం. ఒక్కొక్కరు టెక్నీషియన్స్ గా సినిమా రంగంలో అడుగుపెట్టి.. దర్శకలైన వాళ్ళు ఉన్నారు. దర్శకులు అవుదామని వచ్చి టెక్నీషియన్స్ గా మిగిలిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న ( Hero Nani Love Story ) పాత్రల కోసం వచ్చి హీరోలుగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎలాగైనా హీరో అవ్వాలని వచ్చి చిన్న చిన్న పాత్రలతో సర్దుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ కష్టాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి వచ్చే రిజల్ట్ మాత్రమే. అయితే హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమా రంగంలో అడుగుపెట్టి.. ఈరోజు హీరో అయ్యి.. ఎందరో అభిమానులను తన వశం చేసుకున్నాడు.
నేచురల్ స్టార్ నాని అని పేరు సంపాదించుకున్న నాని అంటే సామాన్య సినీ అభిమానుల అందరికీ కూడా ఎంతో ఇష్టం. నాని సినిమా అంటే అదొక సినిమాటిక్ గా ఉండదు. చాలా నేచురల్ గా ఉంటుంది. అతని నటన అంతా ప్లెజెంట్‌గా ( Hero Nani Love Story ) ఉంటుంది. నాని సినిమా చూస్తూ ఉంటే మనకు తెలిసిన వాడి సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. అలాంటి హావభావాలతో అంత చక్కగా చాలా నేచురల్ గా నటించే హీరో నాని. అయితే ఇటీవల నాని సినిమా దసరా రిలీజ్ అయిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నాని లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అటువంటి పాత్రలో కూడా చాలా చక్కగా నాచురల్ గా నటించాడు మన హీరో నాని.
నాని ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నాడు అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ తో నాని అదరగొడతాడని అందరికీ తెలుసు. ఇప్పటికే నాని ( Hero Nani Love Story ) అలాంటి పాత్రలో జెర్సీ సినిమా ఎంత బాగా నటించిందో తెలిసిందే. ఆ సినిమాలో క్రికెట్ మీద అతనికి ఉన్న ఇష్టం కంటే.. కొడుకు మీద ఉండే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఆ కొడుకు కోసం తన మానేసిన ఆట ఆడి.. ప్రాణం కంటే కొడుకు ఎక్కువ ఇష్టమని చూపించే ఆ సినిమా నిజంగా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు నాని హాయ్ నాన్న సినిమా తెలుగు, తమిళ ,హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాని ఇస్తున్న ఇంటర్వ్యూలో.. తన లవ్ స్టోరీని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాని మూడో తరగతి చదువుతుండగా వాళ్ళ స్కూల్లో ఫ్యాషన్ షో జరుగుతుందంట. ఆ టైంలో ఒక అమ్మాయి ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని.. పొట్టి పొట్టి గౌన్ వేసుకుని వస్తే.. నానికి చాలా నచ్చేసింది అంట. నాని ఆ ఫంక్షన్ లో ఆకులు కట్టుకొని పాత్ర వేశాడంట. అప్పటి నుంచి ఆ అమ్మాయిని లవ్ చేసానని అనుకున్నాడంట. కానీ ఆ మూడో తరగతిలో ప్రేమ విలువ నాకు తెలియదు. ఇప్పుడు హాయ్ నాన్న సినిమాలో షూటింగ్ కియారా ఖన్నా అందంగా రెడీ అయి వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం నేను కియారా ఖన్నా ప్రేమలో ఉన్నాను అని చెప్పాడు. కియారా ఖన్నా అంటే.. హాయ్ నాన్న సినిమాలో నానితో తనకి కూతురుగా నటిస్తున్న చిన్న పాప. నాని చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..