Home Cinema Sai Pallavi: తన పై వస్తున్న పెళ్లి వార్తలపై స్పందిస్తూ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చిన...

Sai Pallavi: తన పై వస్తున్న పెళ్లి వార్తలపై స్పందిస్తూ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

Sai Pallavi Marriage: నాచురల్ అందంతో మేకప్ లేకుండా పలు సినిమాలలో నటిస్తూ తన దైన శైలిలో మంచి గుర్తింపుని సంపాదించుకుని సాయి పల్లవి. నటనలో తనకు ఎవరూ తీసిపోరు అనేంతగా మెప్పించి అందంలో అందరి చూపులు తన వైపే పడేలా చేసుకుని తన డాన్స్ అందరినీ మైమరిపించి అదరగొడుతోంది ఈ అమ్మడు.. అలా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో మరియు మలయాళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలలో నటిస్తూ తన ఏంటో నిరూపించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది. కానీ.. ఈ మధ్య ఏమైందో తెలియదు సాయి పల్లవి గత కొద్ది కాలంగా ఏ సినిమాలలో కూడా నటించకుండా గ్యాప్ ఇచ్చింది. దాంతో ఒక్క సారిగా సాయి పల్లవి అభిమానులు కాసంత సందిగ్ధంలో పడినప్పటికీ.. నెటిజన్లు మాత్రం సినిమాలు చేయకుండా గ్యాప్ ఇవ్వడానికి కారణం ఆమె వివాహం కోసం ఎదురుచూస్తుందని అందుకోసమే సినిమాలకి బ్రేక్ వేసింది అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. కాగా చాలా రోజుల గ్యాప్ అనంతరం తమిళంలో శివ కార్తికేయన్ శాసన ఓ చిత్రంలో నటిస్తున్నట్టు వెల్లడించింది.

See also  Ileana: తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దర్శకులు పచ్చి కామాందులంటూ ఇలియానా సంచలనమైన వాఖ్యలు.

Sai Pallavi 1

కేవలం ఇదే కాకుండా తెలుగులో సైతం అక్కినేని నాగ చైతన్య సరసన మరొక చిత్రంలో కూడా నటించబోతున్నట్లు తెలిపింది. అయితే క్రిందటి మూడు రోజుల నుండి సాయి పల్లవి పెళ్లి రూమర్స్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఓ అబ్బాయి తో కలిసి పెళ్లయినట్టుగా ఇద్దరు దండలు వేసుకొని నిలబడినట్టు ఫోటో కూడా విపరీతంగా వైరల్ చేశారు. కాగా ఈ ఫోటో సినిమా ఓపెనింగ్ లో దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజకుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తుండగా కమలహాసన్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో చిత్ర బృందం తమిళ సాంప్రదాయం ప్రకారం పూల దండలు వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగిందట.

See also  Rashmika: హీరోయిన్ రష్మికకు ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు..

Sai Pallavi Marriage

ఇక ఈ ఫోటోలలో సాయి పల్లవి డైరెక్టర్ రాజ్ కుమార్ పక్క పక్కనే నిలబడడంతో.. అక్కడితో మొదలైంది అసలు సిసలైన ఇష్యూ.. వీళ్లిద్దరు మాత్రమే ఉన్నట్టు ఆ ఫోటోని కట్ చేసి సోషల్ మీడియాలో సాయి పల్లవి ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా వివాహం చేసుకుంది అంటూ వార్తలు సృష్టించడంతో.. ఒక్క సారిగా ఈ వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయం తెలియని వాళ్ళు చాలా మంది కూడా నిజంగానే సాయి పల్లవికి పెళ్లయిందని ఆ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది అటూ మరింత వైరల్ చేసారు. కాగా ఇలాంటి వాటిపై అస్సలు స్పందించని సాయి పల్లవి తన ట్విట్టర్ ఖాతా నుంచి ఈ విషయం గురించి స్పందించడం అయితే జరిగింది.

See also  Balakrishna - Deepika : బాలయ్య దీపక ల గురించి ఇలాంటి వార్త వింటామని ఎవ్వరూ ఊహించరు..

Sai Pallavi

సాయి పల్లవి (Sai Pallavi Marriage)తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకుంది.. నేను సాధారణంగా ఇలాంటి రూమర్స్ పట్టించుకోను కానీ ఇందులో తన కుటుంబం మరియు స్నేహితులు ఉంటే మాట్లాడాల్సి వస్తుందంటూ నేను చేయబోయే తదుపరి చిత్రం యొక్క కార్యక్రమం నుంచి ఒక ఫోటోను కావాలని కట్ చేసి ఇలా డబ్బులు ఇచ్చి మరి ప్రమోట్ చేస్తున్నారంటూ.. కొంత మంది పై విపరీతంగా ఫైర్ అయ్యింది సాయి పల్లవి. నా పని గురించి నా ప్రకటనలు పంచుకుందామన్నప్పుడు ఇలాంటి రూమర్ల పై వివరణ ఇవ్వాల్సి వస్తుందని అసలు ఊహించలేదంటూ ఎందుకు నేను నిరుత్సాహ పడుతున్నానంటూ తెలిపింది. ఇంతటి నిజానికి దిగజారి పోతున్నారా అంటూ ఈ విషయంపై ఫైర్ అయ్యింది సాయి పల్లవి. ఇక ఆమె పోస్ట్ చేసిన పోస్ట్ సాయి పల్లవి అఫీషియల్ ఖాతాలో ఉన్నది మీరు ఒకసారి గమనించవచ్చు.