Home Cinema Skanda First Review: వాళ్ళు ఇచ్చిన స్కంధ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే..

Skanda First Review: వాళ్ళు ఇచ్చిన స్కంధ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే..

ram-and-sreeleela-movie-skanda-first-review-given-by-them

Skanda First Review: రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈపాటికి రిలీజ్ అయి ఉండాలి. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తారు అని వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 15వ తేదీన విడుదల అవ్వాల్సిన సినిమా సెప్టెంబర్ 28కి మారింది. దీనితో ( Skanda First Review ) అభిమానులు అందరూ కొంత అప్సెట్ అయ్యారు. ఏదేమైనా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని రామ్ అభిమానులైతే ఆశిస్తున్నారు.

Skanda-movie-ram-sreeleela-review

అలాగే శ్రీలీల మీద కూడా మంచి నమ్మకం ఉంది అభిమానులకి. రామ్ – శ్రీలీల ల జంట చూడముచ్చటగా ఉంటుందని.. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని ( Skanda First Review ) భారీ ఎత్తున విడుదల చేసే క్రమంలో.. ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా పది రోజులు టైం ఉన్నప్పటికీ.. దీన్ని న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో టాలీ మూవీస్ అనే ఒక సంస్థ విడుదల చేస్తూ ఉండగా.. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ టీంలో ఒక మెంబెర్ ఈ సినిమాను చూసి ట్విట్టర్లో రివ్యూ రాశారు.

See also  నరేష్, పవిత్రల లిప్ కిస్ వీడియో రిలీజ్ చెయ్యడానికి అసలు కారణం ఇదేనంట...

skanda-movie-first-review

 

స్కంద రివ్యూ గురించి ట్విట్టర్లో రాస్తూ.. స్కంద సినిమా సూపర్ గా ఉందని.. ఫస్ట్ ఆఫ్ అంత లవ్ ట్రాక్, హీరోయిన్ తో కామెడీ సీన్స్, రొమాన్స్ అదిరిందని చెప్పారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుందని.. సినిమా చాలా హైప్ లోకి వెళ్తుంది అని చెప్పారు.మామూలుగా బోయపాటి సినిమా అంటేనే కొన్ని అంచనాలతో ( Skanda First Review ) సినిమాకి వెళ్తాము. అలాంటిది ఈ సినిమాలో సంపూర్ణంగా బోయపాటి మార్క్ కనిపిస్తుందని, ఇంటర్వెల్ సీన్ హైప్ అనేది అదిరిపోతుందని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, కామెడీ అంత బాగుంటుందని తెలిపారు.

See also  Jr NTR : ఆ పొలిటీషియన్ కూతుర్ని ప్రేమించిన ఎన్టీఆర్ ఎవరి వలన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?

Skanda-movie-Ram-sreeleela

ఇక సెకండాఫ్ దగ్గరికి వచ్చేసరికి.. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంటుందని.. ఎమోషన్స్ అన్ని చూపిస్తారని తెలిపారు. ఇక లాస్ట్ 20 నిమిషాల సినిమా ఊహించని రీతిలో అది అయిపోతుందని.. సినిమాలో ఆ 20 నిమిషాలు కలెక్షన్స్ రాబట్టే దారిలో వెళ్తుందని.. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. రామ్ – శ్రీలీల ఇద్దరు కూడా సూపర్ హిట్ని వాళ్ల ఖాతాలో వేసుకుంటారని చెప్పుకొచ్చారు. మరి ఆస్ట్రేలియాలో డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన రివ్యూ చాలా పాజిటివ్ గా ఉంది. అసలు సినిమా చూస్తేనే అది ఎలా ఉంటుంది? రిజల్ట్ ఏంటి అనేది సెప్టెంబర్ 28వ తేదీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటిగా వచ్చే రివ్యూలను చూసి అప్పుడు బట్టి అర్థం అవుతుంది. ఏదేమైనా పోస్టర్స్,ట్రైలర్ చూస్తే సినిమా బానే ఉన్నట్టు అనిపిస్తుంది.