Home Cinema Nani: ఎవ్వరికీ తెలియకుండా ఆ స్టార్ హీరోయిన్ తో పిచ్చి పిచ్చిగా గోవా లో ఎంజాయ్...

Nani: ఎవ్వరికీ తెలియకుండా ఆ స్టార్ హీరోయిన్ తో పిచ్చి పిచ్చిగా గోవా లో ఎంజాయ్ చేస్తున్న నాని ..

Nani Enjoying: నాచురల్ స్టార్ నాని గురించి మనందరికీ తెలిసిందే.. అసలు ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ అవుదామని వచ్చి హీరోగా సెటిల్ అయిపోయాడు. అయితే నాచురల్ స్టార్ నాని మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించగా.. అనుకోకుండా అష్టా చమ్మా అనే చిత్రంతో మొట్ట మొదటి సారి హీరోగా అవకాశం రావడంతో ఈ చిత్రంతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం హిట్ అవడంతో ఇంకేముంది తర్వాత మరొక చిత్రంలో కూడా అవకాశం లభించింది. అలా తన తదుపరి చిత్రం అలా మొదలైంది తో కూడా ఇండస్ట్రీలో మంచి హిట్ సాధించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు నాని.

Hi Nanna

అలా తన సహజ నటనతో నాచురల్ స్టార్ అనే బిరుదుని కూడా పొందాడు నాని. ఇక ఇటీవల కాలంలో పాన్ ఇండియా చిత్రం దసరాలో నటించి తన నటనతో అందరిని ఎంతగానో మెప్పించాడు. ఈ చిత్రం కూడా హిట్ అవడంతో మంచి జోష్ మీద కొనసాగుతున్నాడు నాని. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపడంతో నెక్స్ట్ తన తదుపరి చిత్రం హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తుండగా.. ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే ఇప్పటికే చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయని ఇక ఈ చిత్రం డిసెంబర్ 31వ తారీకున విడుదల కాబోతున్నదంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కానీ ప్రస్తుతం నాని గురించి నెట్టింట ఒక వార్త అయితే దుమ్ము లేపుతుంది.

See also  Janhvi Kapoor : జాన్వీ కపూర్ మెగా ఫ్యామిలీ మీద కన్నేయడమే కాకుండా ఎంత పని చేసిందంటే..

Nani Shruti Haasan

నాని (Nani Enjoying) గోవాలో ఓ స్టార్ హీరోయిన్ తో ఎవరికీ తెలియకుండా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఒక వార్త అయితే నెట్టింట జోరుగా ప్రచారం ని అందుకుంది. మనకు అందిన సమాచారం ప్రకారం నాని మరియు శ్రుతి హాసన్ లు  ఎంజాయ్ చేస్తున్నారంటూ వార్త వైరల్ అయింది. దీంతో ఇటు నాని అభిమానులే కాక శృతి హాసన్ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. నాని ఏంటీ.. శృతి హాసన్ ఏంటి అసలేం జరుగుతుంది అని ఆలోచించే లోపలనే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ నాని నటిస్తున్న హాయ్ నాన్న చిత్రం కోసమే అని తెలుస్తుంది. మరి హాయ్ నాన్న చిత్రంలో మృణాల్ ఠాకూర్ కదా హీరోయిన్ గా నటించేది.? మరి శృతి హాసన్ కి పని ఏంటి అని కూడా మీకు డౌట్ రావచ్చు.

See also  Allu Arjun : ఆ హీరోతో అల్లు అర్జున్ మల్టీ స్టారర్ సినిమాకి దర్శకుడు ఎవరో తెలిసా?

Nani Sruthi Haasan

అయితే హాయ్ నాన్న చిత్రంలో నానికి భార్యగా శృతి హాసన్ నటించిన కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అసలు బయట కూడా పెట్టలేదు. కాగా వీళ్ళిద్దరికీ సంబంధించిన సన్నివేశాలని సమ్మర్ లోనే గోవాలో పూర్తి చేసినట్లు ఇండస్ట్రీలో ఒక సీక్రెట్ టాక్ అయితే వినిపిస్తుంది. అయితే అసలు విషయం బయట పడడంతో శృతి హాసన్ సీక్రెట్ గా సన్నివేశాలు తెరకెక్కించాల్సిన అంత అవసరం ఏముంది.. అసలు శృతి హాసన్ ఈ చిత్రంలో నటిస్తుందన్న విషయం బయట పెట్టొచ్చు కదా అంత సీక్రెట్ గా షూటింగ్ చేయవలసిన అవసరం ఏంటని చాలా మంది ఈ చిత్రం గురించి ఆరాధిస్తున్నారు. ఇక ఇందులో అసలు విషయం తెలియాలంటే మరి చిత్రం విడుదల అవుతున్న తేదీ డిసెంబర్ 31 తారీకు వరకు ఎదురు చూడాల్సిందే అట.