Home Cinema Tollywood : మన హీరోయిన్లు ఒక్కో సినిమా ఇన్ని కోట్లు తీసుకుంటున్నారా..

Tollywood : మన హీరోయిన్లు ఒక్కో సినిమా ఇన్ని కోట్లు తీసుకుంటున్నారా..

Tollywood : ఒక సినిమాకి అయ్యే ఖర్చు లో అత్యధిక శాతం ఎక్కువగా హీరో హీరోయిన్స్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉండే స్టార్ హీరోలు పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు కాబట్టి వంద కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. హీరోయిన్స్ ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు కానీ, ప్రస్తుతం వారు తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ సమంజసమే అని అనిపిస్తుంది (Tollywood Actresses Remunueration). ఎంతమంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వచ్చినా అసలు ఏ మాత్రం డిమాండ్ తగ్గని హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు.

tollywood-actresses-remuneration

వాళ్ళే నయనతార, అనుష్క, సమంత మరియు రష్మిక మందన. వీరిలో నయనతార కి సౌత్ ఇండియా లో మొట్టమొదటి నేటి జెనెరేషన్ లేడీ సూపర్ అనే బ్రాండ్ ఇమేజి ఉంది. కేవలం ఈమె కోసం మాత్రమే థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఆమెకి ఒక్కో సినిమాకి 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇస్తుంటారు నిర్మాతలు (Tollywood Actresses Remunueration). ఇక ఆమె తర్వాత సమంత కి కూడా అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు కలిసి గత ఏడాది తమిళం లో ఒక సినిమా చేసారు, ఈ సినిమాకి నిర్మాత నయనతారనే. ఆమె సమంత కి ఈ చిత్రం లో నటించినందుకు గాను 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు టాక్.

See also  Balakrishna - Ram Charan : సంచలనమైన వార్త వెలుగులోకి.. బాలయ్యకు భారీ నష్టం చేసిన రామ్ చరణ్..

anushka-shetty

అప్పటి నుండి సమంత తన రెమ్యూనరేషన్ ప్రతీ సినిమాకి 8 కోట్ల రూపాయలకు ఫిక్స్ చేసినట్టు టాక్. ఇక వీళ్ళతో సరిసమానంగా ఇమేజి ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి (Tollywood Actresses Remunueration). ఈమె ‘భాగమతి’ సినిమా తర్వాత వెండితెర కి బాగా గ్యాప్ ఇవ్వడం తో డిమాండ్ బాగా తగ్గింది. కాబట్టి నయనతార మరియు సమంత రేంజ్ రెమ్యూనరేషన్ కాకపోయినా ఆరు కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు సమాచారం. అలాగే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ స్టేటస్ ని దక్కించుకున్న ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన పైన చెప్పిన హీరోయిన్స్ కి రెమ్యూనరేషన్ విషయం లో దరిదాపుల్లో కూడా లేదు.

See also  Rashmi Gautam: యాంకర్ రష్మీ పెళ్లి పీటలు ఎక్కబోయేది రెండో పెళ్లి చేసుకున్న వాడితో నా.??

keerthy-suresh

ఈమె ఒక్కో సినిమాకి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అట. పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ వచ్చినా కూడా ఆమె రెమ్యూనరేషన్ ని పెంచకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం (Tollywood Actresses Remunueration). ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2’ మరియు ఎనిమల్ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ లు అయితే ఇంత తీసుకుంటున్నారు కానీ అప్పట్లో హీరోయిన్ లకు పెద్ద రెమ్యూనరేషన్ ఉండేది కాదు. ఎంతో కొంత మంచి అమౌంట్ ఇచ్చి నటించమనే వారు. కానీ ఇప్పుడు హీరోయిన్ ల మెయింటనెన్స్ ఎలా ఉంటుందో చూస్తున్నాము కదా, మరి ఆ మాత్రం తీసుకోవటం లో తప్పు లేదు లే.