Tarun : 2000 దశాబ్దం ప్రారంభం లో టాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా కొంతమంది యంగ్ హీరోస్ ఇండస్ట్రీ లోకి వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ దుమ్ము దులిపారు. అలాంటి హీరోస్ లో ఒకడు తరుణ్, బాలనటుడిగా ఒక రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించుకున్న తరుణ్, ఆ తర్వాత ‘నువ్వే కావాలి’ అనే సినిమాతో ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టింది. ఇలా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో గా తరుణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు(Tarun Shreya Love). ఈ సినిమా తర్వాత ఆయన ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని యూత్ లో సంపాదించాడు.
అయితే అప్పట్లో తరుణ్ ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం నడిపాడని, వీళ్లిద్దరి ప్రేమకి తరుణ్ తల్లి రోజా రమణి ఒప్పుకోకపోడం ఆర్తి అగర్వాల్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆరోజుల్లో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెను దుమారమే రేపింది. ఇది ఇలా ఉండగా ఆర్తి అగర్వాల్ కంటే ముందుగా తరుణ్ ఒక హీరోయిన్ తో ప్రేమాయణం నడిపినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. ఆ హీరోయిన్ మరెవరో కాదు, శ్రీయా శరన్(Tarun Shreya Love). ఈమెతో కలిసి తరుణ్ ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను’ మరియు ‘నీ మనసు నాకు తెలుసు’ వంటి చిత్రాల్లో నటించారు.
ఆరోజుల్లో నువ్వే నువ్వే మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లో తరుణ్ మరియు శ్రీయా బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు మనసులు బాగా ఒక్కటయ్యాయి, ఇద్దరు ప్రేమించుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఎప్పుడూ వచ్చే గాసిప్స్ కదా అని జనాలు కూడా పట్టించుకోలేదు. కానీ అప్పట్లో ‘నువ్వే నువ్వే’ సక్సెస్ మీట్ లో తరుణ్ ని శ్రీయ హగ్ చేసుకొని గట్టిగా ముద్దులు పెట్టడంని చూసి కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో నడుస్తుంది అనే ప్రచారం జరిగింది. రీసెంట్ గా కూడా రీ రిలీజ్ అప్పుడు తరుణ్ నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నావ్ కదా అని శ్రీయ ని అడిగినప్పుడు, శ్రీయా నవ్వుతూ తరుణ్ ని ముద్దు పెట్టుకుంటాది.
చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆర్తి అగర్వాల్ అప్పటి టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసింది. పెద్ద డైరెక్టర్ లు అందరూ తన డేట్స్ కోసం వేచి చూసేవారు అంటే తన క్రేజ్ ఏ లెవెల్ ఉండేదో ఊహించుకోండి. ఈ కాలం కుర్రాళ్ళకి తను పెద్దగా తెలియక పోవచ్చు కానీ 90లలో పుట్టిన వారికీ ఆర్తి అగర్వాల్ అనే ఈ పేరు చాలా సుపరిచితం. తను లైపోసెక్షన్ ఆపరేషన్ అనవసరంగా చేయించుకుంది అని ఇప్పటికి తన ఫాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. చేయించుకోకుండా ఉండి ఉంటె ఇప్పటికి తెలుగు ఇండస్ట్రీ ని ఏలుతూ ఉండేది.