Shimbu-Hansika: సినిమా రంగం ఎలాంటిదో అందులో ఉన్న నటీ నటులు వాళ్లు నడిపించే బంధాలు ఎలాంటివో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి తెలుసు. ఇక వాళ్లు ప్రేమించే ప్రేమలు చేసుకునే పెళ్లిళ్లు ఆ తర్వాత బ్రేకప్ లు అన్నీ క్షణాల్లో జరిగిపోతుంటాయి. అవన్నీ వాళ్లకి ఓ సినిమాలో నటించే పాత్రల లాగా నిజ జీవితంలో కూడా అలానే జరుగుతుంటాయి.. అలాంటి జంటలు మన సినిమా ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. ఎంతో గాఢంగా ప్రేమించుకుని అంగర అంగరంగ వైభవంగా వివాహం చేసుకొని కొద్ది రోజులకే ఎవరికి వారు విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరైతే పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడిపోతే.. మరి కొందరు రెండు, మూడు సంవత్సరాలకు విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళని ఎందరినో చూసాం.. ఇదేదో ఇవాళ మొదలు కాలేదు కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని దశాబ్దాల తరబడి ఈ తంతు సినీ ఇండస్ర్టీలో కొనసాగుతూనే ఉంది.
అదేంటో చిన్న చిన్న కారణాలతో ఇట్టే విడిపోతూ ఉంటారు ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్న జంటలు.. కాగా అలాంటి ఒక వార్త ప్రస్తుతం మన ముందుకు వచ్చింది. కోలీవుడ్ లో ఉన్నటువంటి హీరో శింబు నయనతారలు ప్రేమించుకున్నారు. ఇక వీళ్ళ ప్రేమ అప్పట్లో ఓ సంచలనమైన విషయం. ఇక వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి అర్థం కాకుండా సడన్ గా ఎవరికి వారు విడిపోయి బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇక ఆ తర్వాత శింబు యాపిల్ బ్యూటీ హన్సిక తో తన ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించారు. వీళ్ళిద్దరి ప్రేమ కూడా పెళ్లి వరకు వెళ్ళింది. అందరూ అనుకున్నారు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని.. ఎంతలా అంటే హన్సిక ఏదైనా చిత్రం గురించి విదేశాలకు షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు సైతం శంభు అక్కడికి వెళ్ళిపోయేవాడు.. అలా వీళ్లిద్దరు అంత గాఢమైన ప్రేమలో ఉన్న తరుణంలో మళ్లీ ఏమైందో తెలియదు వీళ్లిద్దరి ప్రేమ కూడా పెటాకులయ్యింది.
అయితే వీరిద్దరూ విడిపోవడానికి ఒక కారణం ఉందట.. ఆ కారణం ఏంటన్న విషయం అప్పట్లో బయటకు వచ్చి సంచలమైన విషయం గా మారిపోయింది. హన్సిక చాలా మంది హీరోలతో సినిమాలలో నటించ సాగింది. ఇదే క్రమంలో ప్రస్తుతం ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిది స్టాలిన్ హన్సికలు కలిసిన నటించిన చిత్రం ఓకే ఓకే. ఇక ఈ చిత్రంతో ఈ చిత్రంలో ఉదయనిది సరసన హన్సిక నటించినది. ఇక ఈ చిత్రంలో కలిసి నటించిన అనంతరం ఉదయనిది హన్సికల మధ్య ఓ బంధం ఏర్పడిందన్న వార్త అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఉదయనిధికి సంబంధించిన అపోజిషన్ పార్టీ వాళ్లు సైతం ఈ విషయాన్ని రాజకీయంగా కూడా ఎంతగానో హైలట్ చేశారు. దాంతో అప్పటి మీడియా సైతం ఈ విషయాన్ని ఎంతగానో హైలెట్ చేసింది. దాంతో ఈ విషయం కాస్త శింబు (Shimbu-Hansika) కి తెలియడంతో అసలు భరించలేని శింబు నేరుగా హన్సిక వద్దకు వెళ్లి ఈ విషయం గురించి అడిగేసాడట.
హన్సిక అలాంటిది ఏమీ లేదు అని ఎంత చెప్పినప్పటికీ అసలు హన్సిక మాట వినలేదంట శింబు పైగా ఆమె పై విపరీతమైన కోపంతో ఉండడంతో హన్సిక నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అంటూ ఆమె మనసు విరిగిపోవడంతో వెంటనే శింబు కి బ్రేకప్ చెప్పిందట. ఆ తర్వాత హన్సిక ఒంటరిగానే ఉంటూ గత సంవత్సరం తన చిన్ననాటి స్నేహితుడు వ్యాపారవేత్తని వివాహం చేసుకున్న సంగతి మనమంతా చూసాం. ప్రస్తుత హ్యాపీగా తన వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తుంది హన్సిక. ఇదే కాకుండా ప్రస్తుతం వరుస సినిమాలతో హన్సిక చాలా బిజీ బిజీగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తుంది.