Home Cinema Sharukh khan: షారుఖ్ ఖాన్ కి అన్ని వేల కోట్ల ఆస్థి ఎలా వచ్చిందంటే..

Sharukh khan: షారుఖ్ ఖాన్ కి అన్ని వేల కోట్ల ఆస్థి ఎలా వచ్చిందంటే..

do-you-know-how-many-thousands-of-crores-sharukh-khans-property-value-is

Sharukh khan: భారతదేశ సినిమా ఇండస్ట్రీ మొత్తం గర్వించదగ్గ హీరో షారుక్ ఖాన్. 60 ఏళ్ల దగ్గర పడుతున్న కూడా ఇప్పటికీ స్టార్ హీరోగా ఇప్పటి యంగ్ హీరోలకి పోటీగా దీటుగా నిలబడి నటిస్తూ సంచలనాలను క్రియేట్ చేస్తున్న ( Sharukh Khan’s property value ) షారుక్ ఖాన్ అంటే కేవలం ఇండియాలోనే మాత్రం కాదు.. ప్రపంచం మొత్తం ఆయనకి అభిమానులు ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. యావత్ ప్రపంచంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇష్టపడే ప్రథమ వ్యక్తి అంటే అది షారుఖ్ ఖాన్ అనే చెప్పుకోవచ్చు. షారుఖ్ఖాన్ అంటే అన్ని దేశాల్లో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి కూడా అంత ఇష్టం. ఎంతోమంది ఈయనకి అభిమానులు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు.

do-you-know-how-many-thousands-of-crores-sharukh-khans-property-value-is

అటువంటి షారుక్ ఖాన్ నాలుగు సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉండడం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ ఏడాదిలోనే పఠాన్ సినిమాతో ఆయన సత్తాను చాటాడు. పఠాన్ సినిమా సాధించిన రికార్డు మామూలుది కాదు. అక్కడి నుంచి మళ్లీ షారుఖ్ ఖాన్ స్టార్ తిరగబడిందని అందరూ అనుకున్నారు. అలాగే ఆ సినిమా ( Sharukh Khan’s property value ) తర్వాత అదే సంవత్సరంలోనే సెప్టెంబర్ 7వ తేదీన జవాన్ సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా టాక్ గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు అదిరిపోయింది అని అందరూ ఏకతాటిగా చెప్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

See also  Malli Pelli : మళ్లీ పెళ్లి అమెజాన్ నుండి ఔట్.. రీజన్ పెద్దదే..

do-you-know-how-many-thousands-of-crores-sharukh-khans-property-value-is

బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి సినిమాని బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. సినిమా హైయెస్ట్ రికార్డ్ బాహుబలి తర్వాత ఫలానా సినిమా హైయెస్ట్ రికార్డ్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా చూస్తే బాహుబలి సినిమా కంటే పెద్ద హిట్ అవ్వచ్చు అని ( Sharukh Khan‘s property value ) ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అంటే సామాన్య ఆడియన్స్ కు మాత్రమే కాకుండా.. ఆయనతో కలిసి నటించే హీరోయిన్స్ కూడా ఆయన అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన నటించిన ఓం శాంతి ఓం సినిమాలో ఆయనతో పాటు ఒక పాటలో కనిపించేందుకు ఎందరో హీరోయిన్స్ ముందుకు వచ్చారు. ఆయన నటనలో, ఆయన ప్రవర్తనలో అందరితో అంత చక్కగా ఇమిడిపోయే మనిషిని అర్థమవుతుంది.

See also  Hero Nani : చదువుకునే రోజుల్లో ఆ అమ్మాయిని అలా చూసి అలాంటి పనులు చేశానని సిగ్గు లేకుండా చెప్పేసిన నాని..

ఇంతకీ షారుక్ ఖాన్ కి ఉన్న ఆస్తులు విలువ ఎంతో చాలామందికి తెలియదు. ఇన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టి సంచలనాలు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్ ఆస్థి విలువ ఎంతో ఒక్కసారి తెలుసుకుందాం. కేవలం ఈ సంవత్సరంలోనే షారుఖ్ ఖాన్ 290 కోట్లు సంపాదించాడంట. షారుక్ ఖాన్ కి 200 కోట్లు విలువ చేసే ఒక పెద్ద లగ్జరీ విల్లా తో పాటు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా అనేక వాటికి పనిచేస్తూ ఉన్నాడు.. అటు నుంచి కూడా ఇన్కమ్ గట్టిగానే వస్తుంది. ఇక షారుఖ్ ఖాన్ ఆస్తిపాస్తులన్నీ అన్ని కలిపి లెక్కేస్తే దాదాపుగా 6350 కోట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ కూడా షారుక్ ఖాన్ ఇప్పటికీ ఎంతో కష్టపడుతూ, తన పర్సనాలిటీని మెయింటైన్ చేసుకుంటూ, సినిమాల్లో నటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు..