Jailer: సినిమా ఇండస్ట్రీ అంటే అది ఒక మహాసముద్రం. ఇందులో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ నుంచి ఇంకా చిన్న చిన్న నటీనటుల వరకు.. దర్శక – నిర్మాతలు ఎందరో ఉంటారు. అలాగే పెద్ద – చిన్న టెక్నీషియన్స్ కూడా ఎందరో ( Jailer actor passed away ) ఉంటారు. వీళ్లంతా కలిసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టీం గా ఫామ్ అయ్యే పని చేసేటప్పుడు ఒకరితో ఒకరు ఎంతో చక్కగా సరదాగా ఉంటూ.. ఆ సినిమా పూర్తయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా గడిపే గొప్ప ప్రొఫెషన్ సినిమా రంగం. అలాంటి రంగంలో ఎవరైనా ఒకరు చనిపోతే మిగిలిన వారందరికీ ఎంతో బాధను కలిగిస్తుంది.
గత కొంతకాలంగా సినిమా రంగంలో ఎంతోమంది సడన్గా చనిపోతూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు జైలర్ సినిమాలో నటించిన నటుడు చనిపోవడం జరిగింది. ఇటీవల రిలీజ్ అయిన జైలర్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే. రజనీకాంత్ కెరీర్ లో గత కొంతకాలంగా హిట్ అనేది లేకుండా అనేక డిజాస్టర్స్ తో నడుస్తూ ( Jailer actor passed away ) ఉన్న క్రమంలో.. జైలర్ సినిమా ముందుకు వచ్చి రజినీకాంత్ మొత్తం కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఎలాంటి హిట్స్ వచ్చాయో అతను ఎలాంటి హీరోనో ఒక్కసారి మళ్ళీ నిరూపించింది. జైలర్ సక్సెస్ మామూలు సక్సెస్ కాదని.. వసూళ్లను విపరీతంగా రాబడుతుందని ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము.
ఇలాంటి సినిమాలో నటించిన ఒక నటుడు చనిపోవడం ఎంతో బాధాకరంగా ఫీల్ అవుతున్నారు. ఆ చిత్ర బృందం జైలర్ సినిమాలో విలన్ కి ఎంతో నమ్మకస్తులుగా నటించిన నటుడు జి.మారిముత్తు ఈరోజు ఉదయం గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈ విషయం ( Jailer actor passed away ) తెలిసి సినిమా ఇండస్ట్రీ ఎంతగానో బాధపడింది. ఈయన 100 సినిమాలకు పైగా నటించడం జరిగింది. 100 పైగా సినిమాల్లో నటించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇతను ముఖ్యంగా విక్రమ్, జైలర్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయన కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బుల్లితెరలో సీరియల్స్ కూడా నటిస్తూ ఉంటాడు. మారిముత్తు నటించిన యాంటీ స్విమ్మింగ్ అనే సీరియల్ లో బాగా ఫేమస్ అయిపోయారు.
సినిమాల్లో, సీరియల్ లో నటించడమే కాకుండా.. ఇతను వసంత్ ఎస్ జె సూర్య అనే దర్శకుల దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయడం జరిగింది. మారి ముత్తు మొదటి సినిమా యుద్ధం అనే సినిమాతో నటుడుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా ముష్కన్ దర్శకత్వంలో రూపొందించారు. ఈరోజు ఉదయం సీరియల్ కు డబ్బింగ్ చెప్పిన మారుమత్తు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఆయన నటించి ఇకమీదట అనేక ఆఫర్స్ అందుకోబోయే సమయంలో ఇలా జరగడం నిజంగా బాధాకరమని ఇండస్ట్రీ మొత్తం బాధపడుతుంది..