Home Cinema Suma : అతన్ని పెళ్లి చేసుకుంటా అంటే ఇంట్లో పెట్టి తాళం వేశారు అంట పాపం..

Suma : అతన్ని పెళ్లి చేసుకుంటా అంటే ఇంట్లో పెట్టి తాళం వేశారు అంట పాపం..

Anchor Suma : తెలుగు బుల్లితెర పై దశాబ్దాలుగా స్టార్ యాంకర్ గా కొనసాగుతూ నెంబర్ స్థానం లో నిల్చున్న సుమ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. ఆమె మేనియా ని మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద హీరో సినిమాకి అయినా సుమ ప్రమోట్ చెయ్యాల్సిందే. చిన్న హీరో సినిమా దగ్గర నుండి పవర్ స్టార్ సినిమా వరకు ప్రతీ ఒక్కరి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ యాంకరింగ్ డిఫాల్ట్ గా ఉంటుంది(Anchor Suma Marriage). ఈ గ్యాప్ లో ఎంతో మంది యాంకర్స్ వచ్చారు, సక్సెస్ అయ్యారు కానీ సుమ రేంజ్ ని మాత్రం ఎవ్వరూ మ్యాచ్ చేయలేకపోయారు. ఈ రేంజ్ లో ఆమెకి డిమాండ్ రావడానికి ప్రధాన కారణం ఆమెలోని కామెడీ టైమింగ్ అని చెప్పొచ్చు.

See also  Samantha : ఈ ఫోటోలు చూస్తే సమంత అసలు విషయం బయటపడుతుంది..

anchor-suma

ఎలాంటి సందర్భం వచ్చినా కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కెపాసిటీ కేవలం సుమకి మాత్రమే సొంతం. రాబొయ్యే రోజుల్లో కూడా ఆమె మేనియా నే కొనసాగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలా ఉండగా సుమ రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరి అన్యోన్య దాంపత్యం గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. అయితే సుమ మరియు రాజీవ్ కనకాల పెళ్లి చాలా సులువుగా జరిగిపోయింది అని అందరూ అనుకుంటూ ఉంటారు.

anchor-suma-kanakala

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుమ పెళ్ళికి ముందు ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది(Anchor Suma Marriage). వీళ్లిద్దరి పెళ్లికి రాజీవ్ కనకాల ఇంట్లో ఒప్పుకున్నారు కానీ, సుమ ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. అతనిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అంటూ సుమకి వార్నింగ్ ఇచ్చి ఇంట్లో పెట్టి బంధించారు. వారం రోజుల వరకు బెడ్ రూమ్ నుండి అడుగు బయటకి పెట్టనివ్వలేదట. ఆ సమయం లో సుమ చాలా మానసిక వేదనకి గురి అయ్యిందట. ఆమె బాధ ని చూడలేక, రాజీవ్ కనకాల కి ఇచ్చి పెళ్లి చేశారట. సుమ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

See also  Naga Chaitanya - Shobitha: మరొకసారి బట్టబయలైన శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య ల యవ్వారం. ఒక్క ఫోటోతో ఫుల్ క్లారిటీ..

suma-rajeev-kanakala

ఇకపోతే భార్య భర్తలు అన్నాక కచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉంటాయని, మేమిద్దరం ఇంట్లో ఉన్నప్పుడు ఎదో ఒక విషయం లో గొడవ పడుతూనే ఉంటామని, రాజీవ్ కనకాల కి కాస్త కోపం ఎక్కువని చెప్పుకొచ్చింది. అయితే ఆయన కోపం కాసేపటికే ఐస్ లాగ కరిగిపోతుందని, ఒకసారి గొడవ జరిగినప్పుడు 15 రోజులు మాట్లాడకుండా ఉన్నామని చెప్పుకొచ్చింది. సుమ ఐతే ప్రస్తుతం షో ల మీద షోలు చేస్తూ తెగ బిజీగా ఉంది. సుమ రెమ్యూనరేషన్ షో కి ఇంత అని ఉండదు అంట, షో ఎన్ని గాంతాలు షూట్ చేస్తే అన్ని గంటలు గంటకు ఇంత అని ఉంటుంది అంట. ప్రస్తుతం సుమ దాదాపుగా జైతకు లక్షన్నర తీసుకుంటుంది అంట.