Home Cinema Sukumar : డైరెక్టర్ సుకుమార్ శిషులు మన ఇండస్ట్రీ లో ఇంత మంది ఉన్నారా..

Sukumar : డైరెక్టర్ సుకుమార్ శిషులు మన ఇండస్ట్రీ లో ఇంత మంది ఉన్నారా..

Sukumar : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి తర్వాతి స్థానం ఎవరిదీ అంటే సుకుమార్ పేరు వినిపిస్తాది. పుష్ప సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఇండస్ట్రీ ని షేక్ చేస్తుంటే, సుకుమార్ మాత్రం కేవలం కమర్షియల్ సినిమా ‘పుష్ప’ తో రికార్డ్స్ అన్నిటిని తిరగరాసి నేషనల్ అవార్డ్స్ ని కొల్లగొట్టాడు(Director Sukumar Students). ఆయన దర్శకత్వం లో చాలా కొత్తదనం కనిపిస్తాది, హీరోయిజం లో అప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ముట్టుకొని యాంగిల్స్ ని ప్రయత్నం చేసి శబాష్ అనిపించుకుంటాడు. అందుకే సుకుమార్ కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ఏర్పడింది.

See also  Sreeja : వేరే దారి లేదంటూ మనసులో మాట బయట పెట్టిన శ్రీజ..

director-sukumar

ఇప్పుడు ఇండియా లో చాలా మంది సూపర్ స్టార్స్ నటన పరంగా వేరే లెవెల్ కి వెళ్లేందుకు సుకుమార్ తో పని చెయ్యాలని అనుకుంటారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లతో ఆయన చేసిన సినిమాలు, అందులో ఆ హీరోల అద్భుతమైన నటన చూస్తే సుకుమార్ రేంజ్ ఏంటో అర్థం అవ్వుద్ది. ఇక ఆయన లాగ ఆయన శిష్యుల సినిమాలు కూడా చాలా కొత్తరకంగా ఉంటాయి(Director Sukumar Students). వారిలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు ని తీసుకోవచ్చు. ఈయన మేకింగ్ స్టైల్ చూస్తే అడుగడుగునా సుక్కు మార్క్ కనిపిస్తాది. ‘ఉప్పెన’ చిత్రం లో ఆయన టేకింగ్ స్టైల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

See also  Rajamouli : రాజమౌళి ఆ హీరోయిన్ కి నాలుగు సబ్బులిచ్చి ఏమన్నాడో తెలిస్తే.. వామ్మో అంటారు!

sukumar-allu-arjun

ఇక అదే సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన మరో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Director Sukumar Students). ఈయన ఈ ఏడాది తెరకెక్కించిన ‘దసరా’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూస్తున్నంతసేపు సుకుమార్ స్టైల్ లో టేకింగ్ ఉందేంటి అనిపిస్తాది. మరి ఆయన దగ్గర పని చేసిన డైరెక్టర్ కి ఆ మాత్రం టేకింగ్ లేకపోతే ఎలా..?, వీరితో పాటు బొమ్మరిల్లు భాస్కర్, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు వీళ్లంతా సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళే. వీళ్లంతా టేకింగ్ విషయం లో ఆడియన్స్ చేత శబాష్ అనిపించుకున్నారు. రాబొయ్యే రోజుల్లో వీళ్లంతా ఏ రేంజ్ కి వెళ్తారో చూడాలి.

See also  Nagababu - Niharika : వరుణ్ తేజ్ పెళ్లితో పాటు నిహారిక కి కూడా అతనితో రెండవ పెళ్లి చేస్తున్న నాగబాబు?

sukumar

ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప : ది రూల్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి బుచ్చి బాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. సుకుమార్ మాత్రం పుష్ప సినిమాతో ఇండస్ట్రీ లోనే టాప్ స్థాయికి వెళ్ళిపోయాడు. రాజమౌళి తరువాత ఎవరైనా ఉన్నారు అంటే ఆ స్తానం సుకుమార్ కె సొంతం. ఇక పుష్ప 2 రిలీజ్ ఐతే ఈయన రాజమౌళిని కూడా కిందకు దించే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప 2 కి అప్పుడే 1000 కోట్ల ఆఫర్ లు కూడా వస్తున్నాయి..