Home Cinema Rashmika: చీర కట్టులో తన అసిస్టెంట్ పెళ్లిలో తలుక్కుమన్న రష్మిక. ఐతే మరి ఆ చీర...

Rashmika: చీర కట్టులో తన అసిస్టెంట్ పెళ్లిలో తలుక్కుమన్న రష్మిక. ఐతే మరి ఆ చీర ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.?

Rashmika assistants marriage: అవును ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో చూసిన సరే అటు వెబ్ మీడియాలో చూసినా సరే ఎక్కడ చూసినా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్నటువంటి రష్మిక మందన పేరు ఓ మోత మోగిపోతుంది.. ఎందుకు మరి సోషల్ మీడియా మాధ్యమాలలో రష్మిక మందన పేరు ఈ రేంజ్ లో మారుమోకపోతుందో అంటే అలాంటి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కేవలం తను మాత్రమే కైవసం చేసుకుంది. ఎలా అంటే ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప చిత్రంలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన.

rashmika-looks-gorgeous-at-her-assistants-wedding-in-a-saree-but-do-you-know-who-gifted-that-saree

ఇక ఈ చిత్రంలో శ్రీ వల్లి పాత్రలో రష్మిక అదరహో అంటూ అదరగొట్టి తన నటనతో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం భారీ స్థాయిలో అభిమానులను మూటగట్టుకుంది. ఇక ప్రస్తుతం రష్మిక మందన అయితే ఓ పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క నిత్యం తన అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదో ఒక పని చేస్తూనే ఉంటూ ఉంటుంది. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి తన అసిస్టెంట్ వెడ్డింగ్ హాజరైంది రష్మిక మందన. ఇక ఈ వెడ్డింగ్ లో మునుపేన్నడు లేని విధంగా చాలా సింపుల్ గా అందరి చూపులు ఆమె వైపే పడేలా కనిపిస్తూ పెళ్లిలో తెగ సందడి చేసింది.

See also  Rajamouli : వెకేషన్ కి విదేశాలు వెళ్లకుండా అక్కడికి వెళ్లి అలాంటి పనులు చేస్తున్న రాజమౌళి ఫ్యామిలీ..

rashmika-looks-gorgeous-at-her-assistants-wedding-in-a-saree-but-do-you-know-who-gifted-that-saree

రష్మిక దాంతో ఆమె కట్టుకున్న చీర ఎంతో ఆకర్షణకు గురవడంతో ఒక్కసారిగా ఆ చీర రేటెంత.? అసలు ఆ చీర ఎక్కడ తయారు చేశారు.? ఆ చీర ఆమెకు ఎవరిచ్చారు.? అనే దానిపై చర్చ సాగింది. ఇంత సింపుల్ తో రష్మిక మురిపిస్తూ అందంగా కనిపించే సాగింది ఆ చీరలో.. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం.. ఈ చీరను డిజైన్ చేసింది ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే అని మనకు తెలుస్తుంది. ఇక ఈ చీరను ఆమెకి బహుమతిగా ఇచ్చింది మరెవరో కాదు తన తల్లి గారే.. రష్మిక పుట్టిన రోజు కానుకగా ఈ స్పెషల్ చీరను వాళ్ళ అమ్మగారు రష్మిక ఇచ్చారట.

See also  Nithya Menon: దర్శక, హీరోలతో ఏకంగా అది కావాలంటూ నోరు జారిన నిత్యమీనన్..

rashmika-looks-gorgeous-at-her-assistants-wedding-in-a-saree-but-do-you-know-who-gifted-that-saree

అందులో భాగంగానే తన అసిస్టెంట్ వివాహానికి ఈ చీరను కట్టుకొని రష్మిక విచ్చేశారు. దాంతో సోషల్ మీడియాలో రష్మిక (Rashmika assistants marriage) అభిమానులు తన తల్లి గారిచ్చిన తనకు ఎంతో ఇష్టమైన ఈ చీరను సిరివల్లి కట్టుకున్న అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కాగా మొత్తానికి రష్మిక ఈ చీరలో చూడ్డానికి ఎంతో అందంగా ట్రెడిషనల్ లుక్ లో సాంప్రదాయ బద్దంగా చాలా బాగుంది. దాంతో ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింటే వైరల్ గా మారాయి.