Vijay Devarakonda : మైత్రి మూవీస్ బ్యానర్ లో రిలీజ్ అయిన సినిమా ఖుషి. శివ నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో విజయ్ దేవర కొండా హీరో గా నటించగా, సమంత హీరోయిన్ పాత్రలో నటించింది. ఎన్నో రోజులు కష్ట పడి వీళ్లిద్దరు ఈ సినిమా ని ప్రమోట్ చేసారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమా లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ లను నిలువునా ముంచేసింది. అలానే సమంత సినిమా శాకుంతలం కూడా ప్రొడ్యూసర్ లకి పెద్ద రాడ్ ఏ దింపింది(Vijay Devarakonda 1 Crore). దీనితో ఈ ఇద్దరు నటులకి ఖుషి సినిమా చాలా ముఖ్యం మరియు వారి కెరీర్ లను నిర్ణయించే సినిమా కాబట్టి వీరు ఇద్దరు చాల కష్ట పడి ప్రమోట్ చేసుకున్నారు ఈ సినిమా ని.
చాల మంది అభిమానులు సినిమా ప్లాప్ అవుతుంది అని భావించిన, సినిమా రిలీజ్ అయ్యాక కొంత పాజిటివ్ టాక్ కొంత నెగటివ్ టాక్ తో సినిమా బానే రాణిస్తుంది. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 70 కోట్ల రూపాయిలు సంపాదించి లాభాల బాటలు నడుస్తుంది. ఈ సినిమా అమెరికా లో కూడా బాగా ఆడుతూ 1.4 మిలియన్ డాలర్ లను సంపాదించి. అంటే మన రూపాయల్లో అక్షరాలా 12 కోట్లు పైమాటే. ఈ సినిమా బృందం ఇటీవలే వైజాగ్ లో వారి సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో విజయ్ చాల ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఇండస్ట్రీ లో తనను ఎలా తొక్కేయాలని చూస్తున్నారో చెప్పుకుంటు చాలానే బాధ పడ్డాడు.
తన మీద కోపంతో చాలా మంది పెద్దలు నెగటివ్ రివ్యూస్ రేపిస్తున్నారు అని, అయినా కూడా సినిమా బాగా ఆడుతుంది అంటే అది ఫాన్స్ వల్లే అని చెప్పుకొచ్చాడు విజయ్. తాను తన ఫాన్స్ కి ఎంతో రుణపడి ఉంటాను అని ఖుషి సినిమా ను ఇంత హిట్ చేసినందుకు అభిమానులకి థాంక్స్ కూడా చెప్పాడు విజయ్. ఈ సందర్భంగా విజయ్ తాను ఖుషి సినిమా నుండి తీసుకున్న రెమ్యూనరేషన్ నుండి ఒక కోటి రూపాయిలు కష్టాల్లో ఉన్న 100 కుటుంబాలకి పంచుతానని చెప్పుకొచ్చాడు విజయ్(Vijay Devarakonda 1 Crore). తన మంచి మనసుకు నెటిజనులు అందరూ ఫిదా అయిపోయి విజయ్ ని ఆకాశానికి ఏతెస్తున్నారు.
తాను పంచబోయే ఈ కోటి రూపాయిలను 10 రోజుల వ్యవధిలో రోజుకి 10 లక్షలు చప్పున రోజుకి 10 కుటుంబాలకి అందిస్తాను అని చెప్పుకొచ్చాడు రౌడీ బాయ్. మొత్తమ్ పూర్తి అయినా తరువాత తన సోషల్ మీడియా లో డబ్బులు ఎవరెవరికి అందించాడో తెలుపుతాను అని చెప్పాడు విజయ్. ఇక సమంత విషయానికి వస్తే అమ్ముడు కూడా చాలా సంతోషకంగా ఉంది అనే చెప్పాలి. గత 2-3 సినిమా ప్లాప్ అయ్యి, ఖుషి సినిమా హిట్ అవ్వటంతో తన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. విజయ్ ఇటీవలే బిగ్ బాస్ షో లో తన సినిమా ని ప్రమోట్ చేసుకోవటానికి వెళ్లగా, నాగార్జున నా కోడలు రాలేదు ఏంటి అని అడిగాడు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.