Home Cinema బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ పై నటి సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ పై నటి సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్..!

Actress Surekha Vani: ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు సీజన్స్ ప్రసారం అయితే అందులో 5 సీన్స్ ఒక దానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వచ్చాయి. కానీ ఆరవ సీజన్ మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు, అందుకు చాలా కారణాలు కూడా ఉన్నాయి.

actress-surekha-vani-shocking-comments-on-bigg-boss-season-7-entry

అయితే ఈసారి సీజన్ మాత్రం ఎవరి ఊహకి అందని విధంగా, ప్రేక్షకులను ప్రతీ రోజు థ్రిల్ కి గురి చేసే విధంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఇకపోతే సెప్టెంబర్ మూడవ తారీఖు నుండి 7 వ సీజన్ ప్రారంభం కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ప్రోమోలు కూడా ఇదివరకే టెలికాస్ట్ చేసారు. ఈ ప్రోమో లు ఇంతకు ముందు లాగ కాకుండా, చాలా కొత్తగా ఉండే విధంగా ప్లాన్ చేసారు.

See also  Samantha : దీనితో ఒకరికి గాయం ఇంకొకరికి ఘోరం చూపించిన సమంత..

actress-surekha-vani-shocking-comments-on-bigg-boss-season-7-entry

అయితే ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియా లో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. పలువురి పేర్లని ఒకసారి పరిశీలిస్తే అందులో సీనియర్ నటి సురేఖ వాణి (Actress Surekha Vani) కూడా ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి . సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ ని దక్కించుకున్న సురేఖ వాణి, సోషల్ మీడియా లో ఎంత పాపులర్ సీలెబ్రిటీ అనేది మన అందరికీ తెలుసు. బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఆమె కూతురు సుప్రితా కూడా అంతే. వీళ్ళిద్దరూ కలిసి పార్టీ లకు పబ్బులకు వెళ్లడం, అక్కడ మందు త్రాగి ఎంజాయ్ చేస్తూ వీడియోలు పెట్టడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్లిద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయం సురేఖ వాణి వరకు వెళ్లడం తో ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రెస్పాండ్ అయ్యింది.

See also  Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. హిట్టా ఫట్టా..

actress-surekha-vani-shocking-comments-on-bigg-boss-season-7-entry

ఆమె మాట్లాడుతూ ‘నేను నా కూతురు బిగ్ బాస్ సరికొత్త సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నాం అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. గతం లో కూడా ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి, బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి నెగటివిటీ ని మూటగట్టుకునే స్థితి లో మేము లేము’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.