Allu Arjun: మెగా కాంపౌండ్ నుండి అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా పరిచయం అయినప్పుడు వినపడిన కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటిలా అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టీ సరిపోయింది గానీ, లేకపోతేనా! ఆ కామెంట్స్ వినలేక , జనాలు క్రియేట్ చేసే మీమ్స్ చూడలేక మెగా ఫ్యామిలీ , వాళ్ల ఫ్యాన్స్ సిగ్గుతో చచ్చిపోయే వాళ్లు. అయితే ( Because of that director Allu Arjun ) నవ్విన నాపై చేనే పడుతుంది అనే సామెత నిజం చేస్తూ బన్నీ ఒక హీరోగా మారిన విధానం మాత్రం మామూలు విషయం కాదు. దానికి ప్రధాన కారణం లెక్కల మాస్టర్ సుక్కు. ఒక హీరో గా కాదు కదా , కనీసం సినిమాలో హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కి కూడా అంతంత మాత్రం సూట్ అయ్యే లుక్ నుండి లవర్ బాయ్ లుక్ లోకి అర్జున్ ని మార్చిన సుకుమార్ వెరైటీ స్టోరీ తో , వెరైటీ ట్రీట్మెంట్ తో ఫీల్ మై లవ్ అంటూ తీసిన ఆర్య సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
అంతటితో అల్లు అర్జున్ దశ తిరిగి కెరియర్ గాడిలోపడింది. ఆర్య సినిమా లేకపోతే అల్లు అర్జున్ ఎంత చిరంజీవి మేనల్లుడు అయినా , అల్లు అరవింద్ కొడుకైనా కూడా గంగోత్రి దెబ్బకి మళ్లీ కనపడేవాడు కాడు. ఇక్కడ ఒక విషయం గురించి ( Because of that director Allu Arjun ) అల్లు అర్జున్ , సుకుమార్ తరుచూ అనేక ఇంటర్వూస్ చెప్పిన మాట ఏటంటే ఆర్య సినిమా షూటింగ్ టైం లో యాక్సిడెంట్ల గా సుకుమార్ బోట్ నుండి నీళ్లలో పడిపోతే , ఎవరూ రక్షించే ప్రయత్నం చేయకపోవడం , సుకుమార్ కి సరిగా ఈతరాకపోవడం వలన ఇక చచ్చిపోయానురా దేవుడా అని డిసైడ్ అయ్యే క్షణంలో అచ్చం సినిమాల్లో జరిగినట్టే అల్లు అర్జున్ సాహసం చేసి సుకుమార్ ని రక్షించాడు అంట.
ఇద్దరూ బయటకి వచ్చాక సుకుమార్ థాంక్స్ చెప్పబోతుంటే.. అల్లు అర్జున్ ఒక ప్రామిస్ తీసుకున్నాడు అంట.. ఇంకో ఏడు సినిమాలకి నువ్వే నాకు కథ రాసి పెట్టాలి అని. దానికి సుకుమార్ హ్యాపీ గా ఒప్పుకున్నాడు అంట. ఇచ్చిన మాట ప్రకారం ఆర్య , ఆర్య 2 , పుష్ప , పుష్ప 2 సినిమాలు అల్లుఅర్జున్ తో చేసిన సుకుమార్ అల్లు అర్జున్ తో ( Because of that director Allu Arjun ) ఇంకో 3 సినిమాలు కనీసం చేస్తాడు అన్న మాట. ఆర్య 2 లవ్ స్టోరీస్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకుని పోతే పుష్ప ప్యాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ ని నిలబెట్టింది. రీసెంట్ గా పుష్ప కి గాను జాతీయ చలచిత్ర అవార్డ్స్ లో ఉత్తమ హీరోగా అవార్డు పొందాడు అల్లు అర్జున్.69 ఇయర్స్ ఇండస్ట్రీ హిస్టరీలో తెలుగు హీరోకి మొదటి సారి జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో ఉత్తమ హీరోగా అవార్డు వచ్చింది.
ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ సెరవేగంగా జరుపుకుంటంది. బాహుబలి తో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటిన తెలుగు ఇండస్ట్రీ మళ్లీ అదేస్థాయిలో ప్రపంచాన్ని తాను వైపు తిప్పుకునేటట్టు చేసింది పుష్ప. బాహుబలి 1 కంటే కూడా బాహుబలి 2 అన్ని అవార్డ్స్ ని తిరగరాసింది, కారణం బాహుబలి1 ముగింపు. ఇప్పుడు వై కట్టప్ప కిల్లెడ్ బాహుబలి లాంటి సూపర్ ట్విస్ట్ తో పుష్ప1 ముగిసింది. పుష్ప 2 పక్కా బాహుబలి 2 మించిన హిట్ అయ్యే అవకాశాము ఉందని అందరూ భావిస్తున్నారు. ఆరోజు సుకుమార్ నీళ్లలో నిండా మునగకపోతే , అల్లు అర్జున్ కాకాపడకపోతే ఇలాంటి మిరాకిల్స్ జరిగేవి కావు కదా! మరి లైఫ్ లో ఆమాత్రం ట్విస్టులు లేకపోతే కిక్ ఉండదు మరి.