Baby Movie On OTT: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించినటువంటి చిత్రం బేబీ. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ డైరెక్టర్ సాయి రాజేష్ కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య మరియు మరొక పాత్ర లో విరాజ్ అశ్విన్ లు కలిసి నటించారు. అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండా హంగామా చేయకుండా చాలా చిన్నగా విడుదలైనటువంటి ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ లాంటి పెద్ద చిత్రానికి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. ఇక ఈ చిత్రం చాలా ముఖ్యంగా కుర్రాళ్ళ మనసులకు చాలా చేరువయ్యి ఎంతగానో కనెక్ట్ అయిందని చెప్పాలి.
ఇక ఈ చిత్రంలో నటించినటువంటి ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య నటనకు అందరూ అద్దం పట్టారు. ఇక వాళ్ల నటనను మెచ్చుకోకుండా ఎవ్వరూ ఉండలేరు. ఇక యువత ఆ పాత్రలలోని వాళ్లను ఊహించుకుంటూ థియేటర్లలో తెగ సందడి చేస్తూ అరుపులు కేకలతో నానా హంగామా చేశారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. ఈ చిత్రం చాలా బాగా కనెక్ట్ అయింది. అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలకే ఈ చిత్రం చూస్తున్నంత సేపు ప్రేమలో విఫలమైన అబ్బాయిలు తన ప్రేయసి మోసం చేసిన అబ్బాయిలు కంటతడి పెట్టకుండా లేదంటే అలా కుర్రాలను కట్టిపడేసింది ఈ చిత్రం. అయితే జులై 14 వ తారీఖున విడుదలైన ఈ చిత్రం తొలి ఆటనుండే అదిరిపోయే టాక్ తో
అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఊహించని విధంగా కలెక్షన్ల ప్రవాహంతో దూసుకుపోతూ నిర్మాతలకు డబుల్ త్రిబుల్ లాభాలను చేకూర్చి పెట్టింది. ఇక ఈ చిత్రంలో హైలెట్ గా వైష్ణవి చైతన్య నటన ఈ చిత్రానికే ఎంతో హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. బడా బడా స్టార్ హీరోలు సైతం వైష్ణవి నటన చూసి ఆమె పై ప్రశంసల వర్షాన్ని కురిపించే సాగారు. ఇక ఈ చిత్రం కేవలం 10 కోట్ల బడ్జెట్ తో దాదాపు 80 కోట్లకు పైగా కలెక్షన్ల కాసుల పంట పండిస్తూ రికార్డ్ బ్రేకులు చేసింది. అయితే ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస్ కుమార్ కాగా..
ప్రస్తుతం థియేటర్ రన్ పూర్తి అయిన నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీ (Baby Movie On OTT) లోకి ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్లు ఎంతగానో ఎదురు చూడ సాగారు. కాగా ఆ సమయం రానే వచ్చేసింది. బేబీ సినిమా నిన్నటి నుంచి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటిటిలో నిన్నటి నుంచి చూడాలి అనుకున్న వాళ్లు గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంది. కాగా ఇవాళ అనగా ఆగస్టు 25వ తేదీన నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాల్టి నుంచి ఆహా లో మీరు ఈ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇకపోతే ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ లేని వారు మాత్రం ఇవాల్టి నుంచే ఆహా వేదికగా వేబి చిత్రాన్ని చూడవచ్చు. థియేటర్లో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న చిత్రం బేబీ మరి ఓటిటిలో ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుంది చూడాలి మరి..