Rashmi Breakup: బుల్లి తెర పై నానా హంగామా చేసే యాంకర్ లలో మొదటి వరుసలో ఉంటుంది యాంకర్ రష్మీ. ఇక ఆమె గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు సుడిగాలి సుదీర్ తో లవ్ అనే ఒకే ఒక కారణంతో వీళ్లిద్దరి మధ్య బాండ్ కూడా చాలా బాగుండడం తో బుల్లి తెర పై వీళ్ళ పంట చాలా బాగా పండడం తో వీళ్ళిద్దరి జంట భారీ పాపులారిటీని కైవసం చేసుకుంది. సుధీర్ తో పాటు ఈమె కూడా ఎనలేని ఫాలోయింగ్ క్రేజీ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. బుల్లి తెర పై లవర్స్ లోడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఈ జంట ఇక బుల్లి తెర పై పలు షో లు చూసే నెటిజన్లు నిజంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారా అచ్చం లవ్ బర్డ్స్ లా కనిపిస్తున్నారంటూ ట్రీట్ చేయడం కూడా జరిగింది. అంతే కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ తో వీళ్లిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటారేమో అని ఎప్పుడు చేసుకుంటారని ఎదురు చూసిన బుల్లి తెర ప్రేక్షకుడు ఉండడు. కానీ ఇటీవల కాలంలో ఈ జోడి ఎక్కడ కనిపించడం లేదు. ఇక వీళ్లిద్దరి అభిమానులు కూడా ఎంత గానో హర్ట్ అవుతూ ఉన్నారు. కాగా ఇలాంటి సమయం లోనే హాట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పిన యాంకర్ రష్మీ (Rashmi Breakup) ఇటు తన అభిమానులనే కాకుండా బుల్లి తెర ప్రేక్షకులను సైతం అయోమయానికి గురి చేసింది.
ఓ ఈవెంట్ లో భాగంగా రశ్మి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి లైఫ్ లో 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వరకు ఎన్నో బంధాలు, లవ్ ఫెయిల్యూర్ లు, ఎమోషనల్ అనేవి కామన్ గా ఉండేవి. సేమ్ నా జీవితంలో కూడా వీటి గురించి చెప్పాలంటూ చెప్పకనే చెప్పింది. ఇక పోతే ఆమె మాటలు విన్నటువంటి ఆమె అభిమానులు మరియు నెటిజన్లు రష్మి గౌతమ్ పై సరదాగా కామెంట్లు వేశారు. ఇన్నేళ్లలో ఎన్ని బ్రేకప్ లు అమ్మా నీకు అంటూ ఆమె.పై సెటైర్లు వర్షాన్ని కేంట్ల రూపంలో కురిపిస్తున్నారు.
ఇక పోతే యాంకర్ రష్మీ ప్రస్తుతం జబర్దస్త్ శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి పలు ప్రోగ్రాం లలో చేస్తూ బుల్లి తెర షో లలో ఎంత గానో అలరిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాజాగా బోళా శంకర్ చిత్రంలో చిరంజీవి తో కలిసి ఒక పాటలో కూడా తెగ సందడి చేసింది. ఈ బుల్లి తెర భామ ఇదే కాకుండా కన్నడ సినిమా తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో ఆగస్టు 25న విడుదల కాబోతోంది. ఇందులో ఒక గెస్ట్ అతిధి పాత్రలో నటించింది. కాగా ఈ ముద్దుగుమ్మ పై ఎన్నో రకాల ఇటువంటి కామెంట్ చేస్తూ ఆమె పేరుని ట్రోల్ కి గురి చేస్తున్నారు. నిజంగానే ఎన్నో రకాల బ్రేకప్ లు ఉన్నాయా అంటూ విచ్చలవిడిగా కామెంట్లు చేయసాగారు