Home Cinema Jabardasth : జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్.. అమ్మాయిని వేధించి..

Jabardasth : జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్.. అమ్మాయిని వేధించి..

Jabardasth : జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ కి పరిచయమై నేడు టాప్ స్టార్స్ గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర ఇలా ఎంతోమంది నేడు ఏ స్థానం లో కొనసాగుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. వీళ్ళ రేంజ్ లో కాకపోయినా కూడా, బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరైన మరో జబర్దస్త్ కమెడియన్ నవ సందీప్(Jabardasth Nava Sandeep). తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే టాలెంట్ ఉన్న సందీప్ లో గొప్ప గాయకుడు కూడా ఉన్నాడు. ఎన్నో సందర్భాలలో ఆయన పాటలు కూడా పాడాడు.

See also  Rajamouli: తన పై ఆ దర్శకుడు విసిరిన సవాల్ కి రాజమౌళి ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు?

Jabardast-Nava-Sandeep-arrested

అలా బుల్లితెర ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సందీప్ కి ఇప్పటి వరకు సినిమాల్లో అయితే ఎలాంటి అవకాశాలు రాలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇతను సుడిగాలి సుధీర్ రేంజ్ కి ఎదిగే అవకాశం కూడా ఉంది. అయితే రీసెంట్ గా ఈయన పై ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది. అమీర్ పెట్ కి చెందిన ఈ అమ్మాయి తో చాలా కాలం నుండి సందీప్ ప్రేమాయణం నడిపాడట. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం పడక గది వరకు వెళ్ళింది. అయ్యింది పెళ్లి చేసుకుందాం అని ఆ అమ్మాయి అడిగినప్పుడల్లా సందీప్ మాట తప్పిస్తూ వచ్చాడట.

See also  అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.

Jabardast-Nava-Sandeep

ఇక అమ్మాయి ఇతగాడు నన్ను శారీరకంగా వాడుకున్నాడు అనే విషయం అర్థమై గోల్కొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది(Jabardasth Nava Sandeep). మొదట ఈ కేసు ని పోలీసులు జీరో FIR పేరుతో నమోదు చేసారు. కానీ ఆ తర్వాత మధురానగర్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేసారు. పోలీసులు ప్రస్తుతం ఈ కేసు ని విచారిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. నమ్మించి ఒక ఆడపిల్లను మోసం చేసినందుకు గాను నవ సందీప్ పై నెటిజెన్స్ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆ అమ్మాయి చెప్పేది అబద్దం అయితే ఈపాటికి నవ సందీప్ క్లారిటీ ఇవ్వాలి కదా, కానీ అతని నుండి ఎలాంటి స్పందన లేకపోవడం అనుమానాలు ఇంకా పెరిగిపోతున్నాయి.

See also  Janhvi Kapoor: జూనియర్ ఎన్టీఆర్ మీద మోజుతో జాన్వికపూర్ ఏం కోల్పోయిందో తెలుసా?

nava-sandeep-case-filed

ఇది ఇలా ఉండగా నవ సందీప్ జానపద గీతాలతో మంచి ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా స్టేజి మీద బాలకృష్ణ ముందు ” బాలయ్య బాబు గారు.. మీకు సాటి ఎవరూ లేరు” అంటూ ఆయన పాడిన పాట అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది, కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయం లో ఈ కేసు ఆయనకీ అడ్డుకట్టగా నిలవబోతుందా అనేది చూడాలి. ఫాన్స్ మాత్రం సందీప్ అలా చేసి ఉండదు, కావాలనే ఎవరో ఇలా ఇరికిస్తున్నారు అని వాపోతున్నారు. చూడాలి మరి కోర్ట్ లో ఈ కేసు నిలుస్తుందో లేదో.