Home Cinema ఏంటి పొగడ్తలతో బ్రహ్మానందాన్ని ముంచేత్తితే ఇంటికి వెళ్ళాక ఇలాంటి పనులు చేస్తాడా.?

ఏంటి పొగడ్తలతో బ్రహ్మానందాన్ని ముంచేత్తితే ఇంటికి వెళ్ళాక ఇలాంటి పనులు చేస్తాడా.?

Brahmanandam Habit: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్లు వచ్చినప్పటికీ వాళ్లు ఎంతలా నవ్వుల పువ్వులు పోయించడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళ కామెడీ తో అలరించాలని ట్రై చేసినప్పటికీ కమీడియన్ బ్రహ్మానందం తో ఎవరు సాటి రారనే చెప్పాలి. అసలు ఆయనకి పోటీ లేరనే చెప్పాలి. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు కమెడియన్ బ్రహ్మానందం. ఇక ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన నటించిన ప్రతి ఒక్క చిత్రం ఫుల్ కామెడీ రోల్స్ చేసినవే.. కానీ ప్రస్తుతం రూట్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

See also  Daksha Nagarkar: బంగార్రాజు సినిమా చేసే సమయంలో చైతు అందరి ముందు అక్కడ కిస్ చేశాడు. ఆ తర్వాత సారీ చెప్పి...

brahmanandam-has-this-strange-habit-if-someone-compliments-him-he-does-this-when-he-reach-home

కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఓ మంచి మెసేజ్ ఇచ్చే మెసేజ్ పాత్రాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు బ్రహ్మానందం. కాగా కాస్తంత సీరియస్ లుక్ లోనే ప్రస్తుతం మనకైతే కనిపిస్తున్నాడు. అయితే బ్రహ్మానందాన్ని మాత్రం మన తెలుగు ప్రేక్షకులు ఆయన ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా ఓ కమెడియన్ లాగే చూస్తున్నారు. ఎందుకంటే ఆయన పుట్టిందే మనల్ని కమెడియన్ కామెడీతో చంపేయడానికి అన్నట్లు ఆయన ముఖం చూసే చాలండి ఆ కామిడీ అని ఏదైతే ఉందో అది ఉట్టిపడుతుంది.

brahmanandam-has-this-strange-habit-if-someone-compliments-him-he-does-this-when-he-reach-home

అయితే ఇటీవలే ఆలీ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం.. తాను నటించిన ఏదైనా చిత్రానికి అవార్డు వస్తే ఆ తర్వాత ఆ రోజు ఆయన ఇంటికి వెళ్లి ఏం చేస్తారో అన్న విషయం గురించి తెలియపరిచారు. అందుకు గల కారణాన్ని ఆయన వివరించాడు. ఆ రోజు ఇంటికి వెళ్లి బ్రహ్మానందం గారు నేల పై లుంగీ కట్టుకొని పడుకుంటారనే విషయాన్ని చెప్పుకొచ్చారు. అందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు.  ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని ఎవరైనా పొగిడితే కచ్చితంగా అహంకారం అనేది కూడా పెరుగుతుంది. (Brahmanandam Habit)

See also  Upasana: రామ్ చరణ్ ఉపాసనలు ఇన్నేళ్ళు పిల్లలు కనకుండా ఉండడానికి అసలు కారణం ఇదేనట..

brahmanandam-has-this-strange-habit-if-someone-compliments-him-he-does-this-when-he-reach-homebrahmanandam-has-this-strange-habit-if-someone-compliments-him-he-does-this-when-he-reach-home

మనం ఎప్పటికీ అహంకారం అనే దాంతో అస్సలు బతకకూడదు. అది ఎప్పుడైతే పెరుగుతుందో మనము అంతకు అంత అంతకు దిగజారి పోతూనే ఉంటాం. అలాంటి పరిస్థితుల్లోనే బతకాలంటే ఎప్పుడూ కూడా మనమే గొప్ప మనమే తోపు అనే భావన లేకుండా జీవించాలి. అందుకే నేను నన్నెవరైనా పొగిడినప్పుడు లేదా నా నటనకు మెచ్చుకుని ఎవరైనా నా ముందు ప్రశంసల వర్షాన్ని కురిపించారనుకో నేను ఇంటికి వెళ్లి ఆ రోజు మొత్తం మామూలు మనిషి లాగా బతుకుతాను. కేవలం కటిక నేల పై పడుకుంటాను దాని విలువ ఏంటో తెలుస్తుంది అంటూ ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం ఈ విషయం గురించి వెల్లడించాడు.