Samantha Mother: మనమంతా చూస్తూనే ఉన్నాం. మన తెలుగు ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే హీరోయిన్ల కంటే ఎక్కువగా వాళ్ళ తల్లులే తెగ రెడీ అవుతున్నారు. బయట ఎక్కడికైనా వెళ్లిన సరే లేక మీడియా కంట హీరోయిన్స్ కంటే ఎక్కువగా వీళ్ళే ఫోటోలకు తెగ ఫోజులు ఇచ్చేస్తున్నారు. అలా తాజాగా నెట్టింట ట్రోలింగ్ కు గురైంది హీరోయిన్ సమంత తల్లి గారు.. అయితే ఇటీవలి కాలంలోనే మన తెలుగు చిత్ర పరిశ్రమంలో తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నటువంటి హీరోయిన్ సమంత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే.
ఇక ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్న సమంత అమెరికా బాట పట్టింది. కాగా ఇటీవల ఎయిర్ పోర్ట్ లో తన తల్లితో కలిసి కెమెరాకు ఫోజులిచ్చింది సమంత. ఈ క్రమంలోనే చాలా డల్ గా నీరసంగా కనిపించింది సమంత. కానీ ఆమె మదర్ మాత్రం చాలా చురుగ్గా యాక్టివ్ గా జీన్స్ ట్రెండీ వేర్ లో చాలా స్టైలిష్ లుక్ తో కనిపించారు. దీంతో ఒక్క సారిగా సోషల్ మీడియాలో సమంత ఫోటోలు వైరల్ అయ్యాయి. సమంత మదర్ ఇప్పుడు ఆమె ఎప్పుడూ ఇంత ట్రెండీగా చూసింది ఎప్పుడూ లేదు. ఎప్పుడూ కూడా కేవలం నిండు చీరతో దర్శనమిచ్చే సమంత తల్లి (Samantha Mother) గారు మొట్ట మొదటి సారి ఇలా మోడ్రన్ దుస్తులతో కనిపించడంతో
ఒక్క సారిగా నెట్టిన ట్రోలింగ్ కి గురై సమంతని మించిపోతుందని ఆమె తల్లి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు.. ఇంకొందరేమో సమంత అంటే పడని వాళ్ళు మాత్రం సమంతకి ఆ బుద్ధులు తన తల్లి దగ్గర నుంచే వచ్చినట్లు ఉన్నాయి కదా చూస్తుంటే.. అందుకే ఆమె మోడ్రన్ లుక్స్ లో చాలా స్టైలిష్ గా ట్రెండ్ ఫాలో అవుతుంది కదా.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో మొత్తానికి ఒక్క సారిగా సోషల్ మీడియా అంతటా సమంతనే కాదు సమంత తల్లి గారు కూడా తల్లి గారిని కూడా లాగి లాగి మరి ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు. ఇక సమంత ఇటీవలే నటించి రేపు సెప్టెంబర్ ఒకటో తారీకు అంగరంగ వైభవంగా విడుదలకు ముస్తాబవుతున్న చిత్రం ఖుషి.
ఇక ఈ చిత్రం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరనున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్లుగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కాంబినేషన్ తో విడుదలకు సిద్ధంగా ఉన్నది. చూడాలి మరి వీళ్లిద్దరి జంట ఇండస్ట్రీ రికార్డ్ కొల్లగోడతారా లేదా అనేది మనకు ఈ సినిమా విడుదలైన తర్వాత తెలియనున్నది. ఇక సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావడానికి కోన్నాలపాటు సినిమాలకు దూరంగా ఉంటూ మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి రావడానికి ప్రస్తుత అమెరికా అయితే పయనమయ్యింది. అక్కడ పూర్తిగా తన ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ తన సినీ పరిశ్రమలో తన హవా కొనసాగించనున్నది.