Home Cinema Manju Warrier : 40 ఏళ్ళ వయస్సులో కూడా ఇదేమి అందం సామీ.. ఈ హీరోయిన్...

Manju Warrier : 40 ఏళ్ళ వయస్సులో కూడా ఇదేమి అందం సామీ.. ఈ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Manju Warrier : కొంతమంది హీరోయిన్స్ ఎంత వయస్సు వచ్చినా తరగని అందంతో మెరిసిపోతూ ఉంటారు, ఇప్పటికీ కూడా స్టార్ హీరోల సరసన హీరోయిన్స్ గా నటిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు మంజు వారియర్. ఈమె 1995 వ సంవత్సరం లో సాక్ష్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత ఆమె తమిళం మరియు మలయాళం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. దాదాపుగా రెండు జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి నటించిన మంజు వారియర్ ఇప్పటికీ స్టార్ హీరోల సరసన నటిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

manju-warrier

ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన తమిళ స్టార్ తల అజిత్ ‘తూనీవు’ చిత్రం లో ఈమె హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో అజిత్ తో సమానంగా యాక్షన్ సన్నివేశాల్లో దుమ్ము లేపింది. నాలుగు పదుల వయస్సు లో కూడా ఆమెలో ఉన్న హుషారు తనం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఏడాది ఈమె(Manju Warrier) తూనీవు చిత్రం తర్వాత ‘అయిషా’ మరియు ‘వెల్లరీ పెత్తనం’ వంటి మలయాళం సినిమాలను విడుదల చేసింది. ఈ రెండు చిత్రాలు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే అవ్వడం విశేషం.

See also  Adivi Sesh-Supriya: కారులో అలా చేస్తూ మరొక సారి కెమరాలకు అడ్డంగా బుక్కైన అడవి శేష్ - సుప్రియ..

actress-manju

ప్రస్తుతం ఆమె చేతిలో ‘మిస్టర్ ఎక్స్’, ‘కాయాట్టం’ మరియు ‘అమ్రికి పండిట్’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇలా ఎక్కువగా నటన కి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న మంజు, సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. ఈ ఫోటోలలో నిత్యా యవ్వనం ఉట్టిపడేలా ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న మంజు ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ అందం గా తయారు అవుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

See also  Chiranjeevi : చిరంజీవి పై ఆ విషయంలో అనుమానాలతో ఆందోళనలు..

actress-manju-warrier

ఆమె అంత అందం గా ఉండడానికి కారణం తీసుకునే ఆహారం తో పాటుగా, ప్రతీ రోజు క్రమం తప్పకుండ వర్కౌట్స్ చెయ్యడమే అని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. అయితే ఇంత పాపులారిటీ సంపాదించిన ఈ హాట్ బ్యూటీ ఇప్పటి వరకు తెలుగు లో ఒక్క సినిమా కూడా చెయ్యకపోవడం విశేషం. ఎందుకు ఈమెని మన తెలుగు దర్శక నిర్మాతలు ఇన్ని రోజులు గుర్తించలేకపోయారో అని సోషల్ మీడియా లో ఈమెని చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మన టాలీవుడ్ హీరోయిన్ ల కంటే తిని ఎంతో అందంగా ఉంది అని, మన హీరోయిన్ లు 40 వయసు వస్తే ఆంటీ లా ఉంటారు కానీ ఈమె ఏంటి ఇంత అందాంగా ఉంది అని నెటిజనులు తమ అభిప్రాయం తెలియచేస్తున్నారు. మరి కొందరు నెటిజనులు ఐతే డైరెక్టర్ లను టాగ్ చేసి ఈమెకు బ్రేక్ ఇవ్వాల్సిందే అని గోల గోల చేస్తున్నారు.