Home Cinema ఆరు బాషల్లో విడుదలయ్యి అదరగొట్టిన సౌందర్య – వెంకటేష్ చిత్రమేదో తెలుసా.?

ఆరు బాషల్లో విడుదలయ్యి అదరగొట్టిన సౌందర్య – వెంకటేష్ చిత్రమేదో తెలుసా.?

Soundarya – Venkatesh Film: మూవీ మొగల్ రామానాయుడు తనయునిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినటువంటి దగ్గుబాటి వెంకటేష్ అతి తక్కువ సమయంలో వరుస హిట్స్ తో దూసుకుపోతూ తన ఇంటి పేరు కాస్త హిట్స్ కొట్టి కొట్టి విక్టరీ వచ్చి చేరింది. అలా దగ్గుబాటి వెంకటేష్ కాస్త తన ఇంటి పేరు గా విక్టరీని మార్చుకుని విక్టరీ వెంకటేష్ గా మారిపోయాడు. ఇక అప్పట్లో ఏ నిర్మాత అయిన వెంకటేష్ తో సినిమా అంటే వెనుక అడుగు వేయక పోయేది దానికి కారణం ఆయన ఏ సినిమా తీసిన కచ్చితంగా యావరేజ్ గ్యారంటీ.. నిర్మాతలు పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా వస్తుందని వారికి ప్రగాఢ నమ్మకం ఉండేది. విక్టరీ వెంకటేష్ నటనకు పెట్టింది పేరు. ఇక ఆయన కామెడీ టైమింగ్స్ కూడా ఎక్స్లెంట్ గా ఉంటూ..

See also  Manchu lakshmi : మనోజ్ దంపతులను ఇరకాటంలో పెట్టిన మంచు లక్ష్మి..

do-you-know-the-soundarya-venkatesh-film-that-was-released-in-six-languages

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ను అందుకున్న ఏకైక హీరోగా నిలిచి.. ఇప్పటికే దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆయన క్రేజీ ఏమాత్రం తగ్గకుండా.. అప్పుడు ఎంత యంగ్ గా కనిపిస్తున్నాడో ఇప్పటికీ అలా యంగ్ ఎండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఎప్పుడూ అంతే ఎనర్జీని మైంటైన్ చేస్తూ ఉన్నాడు వెంకటేష్.. వెంకటేష్ ఎంతోమంది తో తను స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ చాలామందితో సక్సెస్ ట్రాక్ ఆయనకు ఉండేది. కానీ వాళ్ళ అన్నింటిలో మరి ముఖ్యమైనది ఆన్ స్క్రీన్ సూపర్ డూపర్ హిట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు విక్టరీ వెంకటేష్ సౌందర్య గారు.. వీళ్ళిద్దరూ కలిసి నటించిన  అప్పట్లో విడుదలైన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఇచ్చాయి. అలా వీళ్ళిద్దరి సినిమా వస్తుందంటే చాలు

See also  Varun - Lavanya : వరుణ్ లావణ్య ఆమె వలన విడాకులు తీసుకోక తప్పదా?

do-you-know-the-soundarya-venkatesh-film-that-was-released-in-six-languages

అభిమానులు కాస్త థియేటర్లకు పరుగులు తీసేవారు. అలాంటి హిట్ జోడిగా కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్లకి కాక జనాలకు కూడా తెలిసిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం వీళ్లిద్దరి చిత్రాలకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందంటే నమ్మశక్యం కాని విషయం.. ఇక వీళ్లిద్దరూ కలిసి దాదాపు అరడజన్ పైగా చిత్రాల్లో కలిసి నటించగా.. వెండి తెర పై వెంకటేష్ సౌందర్య మధ్య కెమిస్ట్రీ చాలా అదిరిపోయేది. అందుకే వీళ్ళ జోడికి ఇంతలా కలిసి వచ్చింది అని చెప్పాలి. అయితే అప్పట్లో వీళ్ళిద్దరూ కలిసి వరుసగా చిత్రాలు చేస్తున్నడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ రకరకాల పుకార్లు వచ్చాయి కూడా.. అయితే ప్రస్తుతం మన అసలు విషయంలోకి వెళ్ళినటయితే..

do-you-know-the-soundarya-venkatesh-film-that-was-released-in-six-languages

వెంకటేష్ సౌందర్య కలిసి నటించిన చిత్రం ఏకంగా మన దేశంలో ఆరు భాషలలో విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. మరి ఆ చిత్రం మదేదో కాదు పవిత్ర బంధం. ఇక అప్పట్లో ఆరు భాషల్లో రీమేక్ అయిన చిత్రమంటే అది మామూలు విషయం కాదు. అప్పట్లో అదొక సంచలమైన రికార్డు. ఇక ఈ చిత్రాన్ని కి దర్శకత్వం వహించిన వారు ముత్యాల సుబ్బయ్య కాగా ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. 1996 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాను దాదాపు ఆరు భాషల్లో అంటే ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, తమిళంలో రీమిక్స్ చేయగా రీమిక్స్ చేసిన ప్రతీ యొక్క భాషలో సంచలమైన ఘన విజయాన్ని కైవసం చేస్తుంది. (Soundarya – Venkatesh Film)