Home Uncategorized Chiranjeevi – Pawan Kalyan : పవన్ ని కాదని చిరు దగ్గరికి వెళ్తే రిజల్ట్..

Chiranjeevi – Pawan Kalyan : పవన్ ని కాదని చిరు దగ్గరికి వెళ్తే రిజల్ట్..

chiranjeevi-bholashankar-movie-was-first-rejected-by-pawan-kalyan

Chiranjeevi – Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్గా కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళాశంకర్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. ఆగస్టు 11వ తేదీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మెగా అభిమానులను సినీ అభిమానులను అలరించే క్రమంలో ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కారణమేమిటంటే.. ఈ సినిమాకి ( Chiranjeevi Bholashankar movie with Pawan Kalyan ) ముందు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే జోష్లో చిరంజీవి ఇప్పుడు ఈ సినిమాని ఇంకా బాగా చేశాడని.. పైగా ట్రైలర్ చూస్తుంటే అదంతా అర్థమవుతుందని అభిమానులు అంటున్నారు.

chiranjeevi-bholashankar-movie-was-first-rejected-by-pawan-kalyan

ఇదిలా ఉంటే అసలు భోళాశంకర్ సినిమా చిరంజీవి చేయాల్సింది కాదంట. ఈ సినిమా ముందుగా ఇంకొక స్టార్ హీరో కి చెప్పారంట. ఆ స్టార్ హీరోతో ఈ సినిమా మొదలు కూడా అయ్యిందంట. షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ముహూర్తం ( Chiranjeevi Bholashankar movie with Pawan Kalyan ) పెట్టి పూజ కూడా చేశారంట. కానీ కొన్ని కారణాల వలన ఆ స్టార్ హీరోతో సినిమా చేయలేకపోయారంట. ఆ తర్వాత చిరంజీవిని అప్రోచ్ అయ్యి.. చేయడం జరిగిందంట. ఇంతకీ ఏ స్టార్ హీరో నుంచి చిరంజీవికి వచ్చింది అనుకుంటున్నారా? ఎవరో కాదు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాని మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొని వెళ్లారు అంట.

See also  Singer Mangli: అమాతం రెమ్యునరేషన్ పెంచేసిన మంగ్లీ ఇప్పుడు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా.?

chiranjeevi-bholashankar-movie-was-first-rejected-by-pawan-kalyan

పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఓకే కూడా చెప్పడం జరిగిందంట. పూజా కార్యక్రమాలు కూడా చేశారంట కానీ.. తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని కారణాల వలన ఆ సినిమాని స్టార్ట్ చేయలేకపోయారంట. ఆ సినిమాని నో చెప్పిన పవన్ కళ్యాణ్ మరో మూవీ చేశాడంట. అదే కాటమరాయుడు. కాటమరాయుడు సినిమా పెద్ద సక్సెస్ కాలేదు.. అనుకున్న ( Chiranjeevi Bholashankar movie with Pawan Kalyan ) స్థాయిలో మంచి రిజల్ట్ రాలేదు.. ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. దాంతో ఇంక పవన్ కళ్యాణ్ ఈ సినిమాని టచ్ చేయడం మానేసాడంట. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును తీసుకొని చిరంజీవి దగ్గరికి వెళ్లారట. చిరంజీవి ఈ ప్రాజెక్టును చూసి రీమేక్ సినిమా అని ముందు కొంచెం ఆలోచించి.. ఆ తర్వాత ఈ సినిమా ఎక్కడ ఓటీటీ లో ఇంతవరకు రాలేదని తెలిసి ఓకే చెప్పారంట.

See also  Puri-Charmi: చార్మి ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటే.. పూరి లైట్ తీసుకోమన్నాడట ఇంతకీ ఏం జరిగింది.?

chiranjeevi-bholashankar-movie-was-first-rejected-by-pawan-kalyan

అలా ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఖాళీ లేకపోవడం వల్ల ఇంక ఆయన్ని కాదని.. చిరంజీవి దగ్గరికి వెళ్లిన చిత్ర బృందానికి చిరంజీవి ఒకే చెప్పడంతో.. ఎంతో ఆనందంగా ఆ సినిమాని మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. రీమిక్స్ సినిమాలు హిట్టయితే సూపర్ డూపర్ హిట్ అవుతాయి లేదా డిజాస్టర్ గా మిగిలిపోతుంటాయి. అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా అవ్వకూడదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ కూడా చాలా మార్పులు చేర్పులు చేసి చిరంజీవి ఇమేజ్కు తగ్గట్టుగా చేశారని ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చిత్ర బృందం అయితే అంటుంది. మరి దీని రిజల్ట్ కొంచెం వెయిట్ చేస్తే మనం 11వ తారీకు చూస్తే అర్థమవుతుంది.