Senior Stars: టైటిల్ వినగానే ఏంటి దర్శకుల చేతుల్లో అలనాటి సీనియర్ స్టార్ హీరోయిన్లు మోసపోవడం ఏంటని ఆలోచిస్తున్నారా.? అవును.! ఇప్పటిలా సోషల్ మీడియాలు వెబ్ మీడియాలు లేవు. క్యాస్ట్ కౌంచింగ్ గురించి ఇప్పుడు మాట్లాడినంత తేలికగా బహిర్గతం చేయడానికి వీలుండేది కాదు. క్యాస్ట్ కౌచింగ్ గురించి ఎంతో అంతర్గతంగా వాళ్ళలో వాళ్ళే దాచుకుంటూ కుమిలిపోయేవారు. ఒక వేళ దైర్యం చేసి ఆ విషయాన్ని చెప్పలానుకుంటే ఇక వాళ్ళ పని గోవిందా.. అవకాశాలు అనేవి అటునుంచి అటే అన్నమాట. ఐతే ఇక ఇలాంటి సమస్యలు తెలుగు లో కంటే తమిళం లో విపరీతమైన సమస్యలు ఇలాంటివే ఎన్నో ఉండేవి అంటే అది అతియోశక్తి కాదు. అందువల్లే నాటి పరిస్థితుల దృష్యా చాలా మంది హీరోయిన్లు తెరమీదికి తమ ఆడపిల్లలను తీసుకువచ్చే వాళ్ళు కాదు.
ఇలాంటి ఇబ్బందులు అప్పట్లో ఎందరో స్టార్ హీరోయిన్లు సైతం ఎదుర్కొన్నవే. అలాంటి వాళ్ళలో చాలా మంది హీరోయిన్లు సైతం ఇలాంటి ఇబ్బందులు పడ్డారంటే ఆశ్చర్యం లేకపోలేదు. అలాంటి వాళ్ళలో జయ సుధ, జయప్రద, సరిత, దివ్య భారతి మొదలైన స్టార్ హీరోయిన్లు సైతం ఉన్నారంటే ఆశ్చర్యపోవలసిన విషయమే. ఐతే ఓ సందర్భంలో ఫలానా అగ్రతార మాట్లాడుతూ ఆ దర్శకుడు నా శీలాన్ని తన దగ్గర తాకట్టు పెట్టమని చెప్పాడంటూ తను చెప్పుకువచ్చింది. ఐతే ఆ తర్వాత ఆ తార అదే దర్శకుడితో వరుస చిత్రాలలో నటించడం ఆశ్చర్యపోయే విషయం.
అంతే గాక ఆ హీరోయిన్ మరొక దర్శకుడితో కూడా తనను అర్పించుకుంటే తప్ప ఇతర చిత్రాలలో అవకాశాలు రాలేదు. కేవలం స్టార్ హీరోయిన్లు మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుల పై డైరెక్టర్ల ఒత్తడి ప్రభావం కూడా అప్పట్లో విపరీతంగా ఉండేది. ఇక ఇదే కాకుండా అలనాటి సిల్క్ స్మిత సైతం ఓ అగ్ర నిర్మాతతో ఆర్ధికంగా, శారీరకంగా నష్టపోవడమే కాకుండా అంతకంటే ముందే ఓ అగ్ర దర్శకుడు సైతం ఆమెను వాడుకుని వదిలేసాడనే టాక్ కూడా ఉంది.
అలాగే దివంగత తార దివ్య భారతి విషయంలో సైతం మన తెలుగులో ఉన్న ఓ అగ్ర దర్శకుడు విషయంలో అలాంటి విమర్శలే ఎదురయ్యాయి. పైగా ఆమె అతడి విషయంలో అంగీకరించి వార్తలు కూడా ఎన్నో రకాలుగా వ్యాపించాయి. దాంతో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలపై దాదాపు రెండు నెలల పాటు ఇదే వార్త చర్చకు రావడం చర్చనీయాంశమైన విషయం. అయితే ఇప్పటివరకు ఇంత హీరోలు హీరోయిన్లను ఎలా వాడతారు అన్న విషయం ప్రచారంలో ఉందో అదే రకంగా నాటి నుంచి నేటి వరకు కూడా అదే హీరోయిన్లను దర్శకులు సైతం వాడతారనే రూమర్స్ కూడా లేకపోలేదు. (Senior Stars)