Home Cinema Prabhas: ఏంటీ.? రామ్ చరణ్ ఛీ కొట్టిన ఆ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్...

Prabhas: ఏంటీ.? రామ్ చరణ్ ఛీ కొట్టిన ఆ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడా.?

Prabhas Blockbuster: మెగాస్టార్ చిరంజీవి తనయునిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో జాబితాలోకి వెళ్లిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.. ఇక మరి ఇటీవలి కాలంలో నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన విషయం ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి తెలిసిన విషయమే. ఇక ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో చాలా బిజీ బిజీగా ఉన్నాడు. ఇక హీరోలు అన్న తర్వాత వచ్చిన సినిమాలన్నీ చేయాలని ఏమీ ఉండదు. అలా చరణ్ కూడా తన సినీ కెరియర్లో ఎన్నో చిత్రాలను రిజెక్ట్ చేశాడు. అలా వదులుకున్న చిత్రాలలో హిట్ అయినవి ఉన్నాయి ఫట్ అయినవి ఉన్నాయి. అయితే గతంలో రామ్ చరణ్ ఛీ కొట్టిన ఓ సినిమాతో పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడట.

See also  Ram Charan - Mahesh Babu : రామ్ చరణ్ మహేష్ బాబు ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్.. కానీ అడ్డుగా నమ్రత..

did-prabhas-a-blockbuster-hit-with-that-movie-that-ram-charan-didnt-want-at-first

మరింతకు ఆ చిత్రం ఏంటని దాని కోసం తెగ ఆలోచిస్తున్నారు కదూ.? మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిత్రం ఏదో తెలుసుకుందాం. ఎం.కరుణాసాగర్ దర్శకత్వం వహించిన చిత్రమే ఈ చిత్రం అదే డార్లింగ్.. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కలిసి జంటగా నటించారు. ఇక ఈ చిత్రంలో పలు ముఖ్యమైన పాత్రలో నటించిన వారు శ్రద్ధా దాస్, ప్రభు, ఎమ్మెస్ నారాయణ, ముకేశ్, రిషి, చంద్ర మోహన్ మొదలైన వారు. ఇక ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ మేనల్లుడు జీ.వి ప్రకాష్ సంగీతాన్ని అందించగా.. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.బి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

See also  Lavanya Tripathi : ఆ ఒక్క కారణం వలన లావణ్య త్రిపాఠి పెళ్ళికి నో చెప్పేసిందట!

did-prabhas-a-blockbuster-hit-with-that-movie-that-ram-charan-didnt-want-at-first

కాగా ఈ చిత్రం 18 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా 2010వ సంవత్సరంలో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత ప్రభాస్ పేరు డార్లింగ్ ప్రభాస్ గా మారిపోయింది కూడా.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గారు రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఓ పక్క యూత్ లో మరో పక్క ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా అలరించి ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని కన్నడ, ఉర్ధూ భాషలలో కూడా రీమేక్ చేశారు. ఇక ఇదే కాక బాలీవుడ్ లో సైతం డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చేయగా 15 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి ఈ చిత్రానికి..

See also  Chiranjeevi : ఇన్నాళ్లకు తన కూతురు శ్రీజ గురించి నోరు విప్పిన చిరంజీవి..

did-prabhas-a-blockbuster-hit-with-that-movie-that-ram-charan-didnt-want-at-first

అయితే ఇప్పటి వరకు ఇటు రామ్ చరణ్ అభిమానులకు కానీ అటు ప్రభాస్ అభిమానులకు కానీ తెలియని అసలు సిసలైన విషయమేంటంటే.. డార్లింగ్ చిత్రానికి మొదట ఎంపిక చేసుకున్న హీరో ప్రభాస్ కాదట. డైరెక్టర్ ఎం.కరుణాసాగర్ ఈ కథను మొదటి రామ్ చరణ్ కు వినిపించగా.. ఎందుకో ఈ చిత్రం యొక్క కథ రామ్ చరణ్ ను అంతగా ఆకట్టుకోలేక పోయిందట. దాంతో చాలా సున్నితంగా రామ్ చరణ్ ఈ కథను రిజెక్ట్ చేయగా ఆ తర్వాత ప్రభాస్ కు వినిపించాడట. ఆయనకు బాగా నచ్చేయడంతో.. అలా పట్టాలెక్కి ఇలా బ్లాక్ బస్టర్ హిట్ ను ప్రభాస్ (Prabhas Blockbuster) కు అందించింది డార్లింగ్ చిత్రం. ఇక ఈ చిత్రం ప్రభాస్ లైఫ్ లో గుర్తుండిపోయేలా ఎప్పటికీ చిత్రంగా నిలిచింది.