Home Cinema Ram Charan – Rajamouli : రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ సరసన నటించినన్న ఆ...

Ram Charan – Rajamouli : రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ సరసన నటించినన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

anushka-was-ignore-that-offer-in-ram-charan-and-rajamouli-movie-magadheera

Ram Charan – Rajamouli : ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరూ చెప్పలేం. ఆ నిర్ణయం వెనక వాళ్ళు చెప్పే రీజిన్ నిజమే అయినా కూడా దాని పరిణామం చూస్తే బాధ పడాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఒక బ్రాండ్.. ఆయన సినిమాలో చిన్న పాత్ర నటించే అవకాశం ( Ram Charan and Rajamouli movie ) వచ్చినా కూడా ప్రతి నటుడు, నటురాలు ఆనందంతో మురిసిపోతారు. ఎందుకంటే సినిమాకి తన ప్రాణాన్ని పెట్టి, ఆ సినిమాని కచ్చితంగా హిట్టు మాత్రమే చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చే గొప్ప దర్శకుడు కాబట్టి. అలాంటి రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేసిన ఒక సినిమాలో.. హీరోయిన్గా ఇచ్చిన ఆఫర్ ని ఆమె నో చెప్పిందంట.

See also  Kriti Sanon: ప్రభాస్ తో పెళ్ళని నా ఫ్రండ్స్ కూడా కంగ్రాట్స్ చెప్పారు.. ప్రభాస్ తో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన కృతి సనన్..

anushka-was-ignore-that-offer-in-ram-charan-and-rajamouli-movie-magadheera

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా కలెక్షన్ రికార్డులు బద్దలు కొట్టేంతగా చిరస్థాయిగా నిలిచిపోయింది. మగధీర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేయగా కాజల్ ( Ram Charan and Rajamouli movie ) హీరోయిన్గా నటించింది. ఆ సినిమాలో నటించిన తర్వాత రామ్ చరణ్, కాజల్ లెవెల్ తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక కాజల్ కి అయితే విపరీతమైన ఆఫర్స్ వచ్చాయి. రాజమౌళి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి విపరీతమైన గౌరవం పెరిగింది. అయితే మగధీర సినిమాలో రామ్ చరణ్ హీరోగా అనుకున్న తర్వాత మొదటగా హీరోయిన్గా కాజల్ అనుకోలేదంట.

See also  Big Boss: రెండవ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రాబోతున్న హాట్ బ్యూటీ ఈమెనే..

anushka-was-ignore-that-offer-in-ram-charan-and-rajamouli-movie-magadheera

ఆ సినిమాలో హీరోయిన్గా రాజమౌళి మొదట అనుష్క శెట్టి ని అనుకున్నాడంట. ఎందుకంటే అనుష్క శెట్టి విక్రమార్కుడు సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో ఆల్రెడీ నటించింది. అందుకని ఆమె నటన ప్రతిభ గురించి తెలుసు. ఆమె హైట్.. ఆమె పర్సనాలిటీ రాజకుమార్తిగా చాలా బాగుంటుందని ఊహించుకున్న రాజమౌళి నేరుగా అనుష్క ( Ram Charan and Rajamouli movie ) దగ్గరికి వెళ్లి ప్రాజెక్టు గురించి చెప్పాడంట. అనుష్క మొత్తం కథ విని అందులో ఆమె ప్రాముఖ్యతను విని అన్ని నచ్చాయి గాని సినిమాకి నటించడానికి నో చెప్పిందంట. దీంతో రాజమౌళి ఒక్కసారిగా షాక్ అయ్యాడట. సినిమా కథ నచ్చి.. ఆమె పాత్ర నచ్చి.. అన్ని నచ్చిన తర్వాత నో చెప్పడానికి గల రీజన్ ఏమిటి అని రాజమౌళి అడిగాడంట.

anushka-was-ignore-that-offer-in-ram-charan-and-rajamouli-movie-magadheera

దానికి అనుష్క రీజన్ ఒక్కటే.. ఆ సినిమాలో హీరో రామ్ చరణ్ అవ్వడం అని చెప్పింది అంట. అప్పుడు రాజమౌళి రామ్ చరణ్ తో వచ్చిన సమస్య ఏమిటి అని అడిగాడంట. ఏమీ లేదు రామ్ చరణ్ హైట్ తక్కువ.. నేను హైట్ చాలా ఎక్కువ. మేమిద్దరం కలిసి ఈ సినిమాలో నటించడం వలన మా ఇద్దరికీ కుదరదు.మేమిద్దరం అక్క తమ్ముళ్ల లా ఉంటాం కాబట్టి ఆ పాత్రలో నేను నటించను అని చెప్పిందంట. దానితో హీరోయిన్ కోసం హీరోని మార్చలేని పరిస్థితి కాబట్టి.. రాజమౌళి అనుష్క బదులు కాజల్ ని తీసుకున్నాడు అంట. ఆ తర్వాత కచ్చితంగా మగధీర కొట్టిన హిట్టును చూసి అనుష్క ఫీలయ్యే ఉంటుంది. ఏదేమైనా ఇందులో అదృష్టవంతులు ఎవరంటే కాజల్ అనే చెప్పుకోవాలి. ఆ సినిమాతో ఆమె స్థాయి ఎక్కడకో వెళ్ళిపోయింది.