Home Cinema Bro Trailer : చరిత్ర సృష్టించనున్న బ్రో ట్రైలర్.. తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్...

Bro Trailer : చరిత్ర సృష్టించనున్న బ్రో ట్రైలర్.. తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం.

bro-movie-trailer-release-function-in-two-telugu-states

Bro Trailer : ఈరోజు ఎక్కడ చూసినా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినీ అభిమానులు అందరూ కూడా ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బ్రో. ఈ సినిమాపై మెగా అభిమానులకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధర్మతేజ్ ( Bro movie trailer release function ) హీరోలుగా నటించిన ఈ సినిమా కోలీవుడ్లో వినోదం శీతం అనే సినిమా పేరుతో సూపర్ హిట్ అయిన సినిమా.అయితే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. ఆ సినిమాలో పాయింట్ తీసుకొని అందులో అనేక మార్పులు చేసి చేస్తున్నారని అంటున్నారు.

bro-movie-trailer-release-function-in-two-telugu-states

బ్రో సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా కథలో అనేక మార్పులు చేర్పులు చేసి రెడీ చేశాడు. అలాగే పూర్తిగా కొన్ని సన్నివేశాలను ఆ సినిమా నుంచి మార్పులు చేసి.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చారని అంటున్నారు. అయితే ఈ సినిమా టీజర్, పాటలు ( Bro movie trailer release function ) ఇప్పటికీ రిలీజ్ అయినవి మంచి టాకే తెచ్చుకున్నాయి. పాటలు అయితే మొదట్లో పెద్ద టాక్ రాలేదు. యావరేజ్ టాక్ వచ్చింది కానీ.. ఆ తర్వాత నిమ్మదిగా అవి కూడా బానే అందుకున్నాయి. అయితే అసలు సిసలైన ట్రైలర్ గురించి ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు అతి కొద్ది గంటల్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.

See also  Prabhas : ఆ ఒక్క హీరోయిన్ ని జాకెట్ లేకుండా చూసేసిన ప్రభాస్

bro-movie-trailer-release-function-in-two-telugu-states

అయితే ఈ ట్రైలర్ ని మామూలుగా ఏదో ఒక ప్లేస్ లో ఒక వేడుక చేసుకొని రిలీజ్ చేయడం కాకుండా.. తెలుగు రెండు రాష్ట్రాల్లోనీ ఎంతో వైభవంగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఒకే టైంలో తెలుగు రాష్ట్రాల్లో ( Bro movie trailer release function ) ప్రముఖ సిటీలను ఎంచుకున్నారు. ఈరోజు సాయంత్రం 6.గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నామని సరికొత్త పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఏపీలోని విశాఖపట్నంలో జగదాంబ థియేటర్లో ఈ ట్రైలర్ లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ జరిగే ఈవెంట్లో హీరో సాయిధరమ్ తేజ్ వస్తున్నాడు. అలాగే హీరోతో పాటు నిర్మాత జిటి విశ్వ ప్రసాద్ కూడా వైజాగ్ జగదాంబలో జరిగే ఈవెంట్లో పాల్గొనబోతున్నారు.

See also  Raksha Bandhan : రాఖీ విషయంలో ఈ తప్పు చేస్తే మీ సోదరిడి జీవితం మీరే నాశనం చేసిన వాళ్లు అవుతారు.

bro-movie-trailer-release-function-in-two-telugu-states

ఈ వేడుక చూసేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెగా అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాగే అదే టైంలో తెలంగాణలో హైదరాబాద్ సిటీని ఎన్నుకుని.. దేవి 70mm ధియేటర్లో ఈ వేడుకను చేయబోతున్నారు. ఇక్కడ జరిగే ట్రైలర్ లాంచర్ ఈవెంట్ కి దర్శకుడు సముద్రాఖని.. హీరోయిన్ కేతిక శర్మ సంగీత దర్శకుడు పాల్గొంటున్నారు. ఇలా ఒకేసారి ట్రైలర్ రిలీజ్ అనే ఫంక్షన్ని రెండు చోట్ల ప్లాన్ చేసి ఇలా విడుదల చేయడం అనేది ఇంతవరకు ఏ సినిమాకి కూడా జరగలేదు. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఇలా టాలీవుడ్ హిస్టరీలో ఎప్పుడూ కూడా ఏ సినిమాకి కూడా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ వేడుకని చేయలేదు. అయితే రెండు చోట్ల వేడుకలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం రావడం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక ఇలా రెండు చోట్ల జరగడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు.