Home Cinema Baby movie : బేబీ సినిమా నేర్పిన ఏడు పాఠాలు ఇవే.. ఇందులో మీకెన్ని ఎదురయ్యాయి..

Baby movie : బేబీ సినిమా నేర్పిన ఏడు పాఠాలు ఇవే.. ఇందులో మీకెన్ని ఎదురయ్యాయి..

these-are-the-seven-important-lessons-to-learn-in-baby-movie

Baby movie : ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ ఇంకొక హీరోగా.. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఎక్కడ చూసినా యూత్ అంతా కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాపై మొదట యావరేజ్ టాక్, మిక్స్డ్ టాక్ ( seven important lessons to learn in Baby movie ) రావడం జరిగింది కానీ.. నెమ్మదిగా సినిమా అందరికి కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా యూత్ విపరీతంగా ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. కారణం ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఈ సినిమా హత్తుకుని ప్రతి సీను తీసినట్టుగా అనిపించింది. అయితే ఇప్పుడు బేబీ సినిమాపై సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రివ్యూల్ని చాలా బాగా ఇస్తున్నారు.

See also  Kalyan Ram: కళ్యాణ్ రామ్ టాటూ వెనుక అసలు సీక్రెట్ తెలిస్తే.. అవాక్కు అవుతారు..

these-are-the-seven-important-lessons-to-learn-in-baby-movie

బేబీ సినిమా నుంచి ముఖ్యంగా ఏడు పాఠాలను మాత్రం నేర్చుకోవాలని ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ సినిమాలో మన చుట్టూ జరుగుతున్న చాలామంది జీవితాల్లో ఉన్నవే ఈ సినిమా తీసినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సినిమాలో చూపించిన ఏడు పాఠాలు ఏమిటంటే.. 1, మనమే లోకం అనుకుంటున్న ( seven important lessons to learn in Baby movie ) వాళ్ళకి కూడా.. మనం కాకుండా, మనకు తెలియకుండా వాళ్లకు వేరే లోకం కూడా ఉండవచ్చని ఈ సినిమా చూపించింది. ఈ సినిమాలో ఆనంద దేవరకొండ తనే ఆ హీరోయిన్ కి లోకం అనుకుంటాడు కానీ.. ఆమె జీవితంలో హీరోకి తెలియకుండా వేరే లోకాన్ని క్రియేట్ చేసుకుంటది. 2, మనకి ఎంత మంచి స్నేహితులు అయినా కూడా.. ఒక్కసారిగా మనం చేసేది తప్పు అని ముఖం మీద చెబితే.. వాళ్ళని మనం దూరం పెట్టేస్తాము. దాని వలన మనం చాలా నష్టపోతాము.

See also  Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటిటిలోకి ఎప్పుడు.. ఎందులోకి.?

these-are-the-seven-important-lessons-to-learn-in-baby-movie

3, తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు ( హీరోయిన్ చేసిన తప్పు )ముమ్మాటికి తప్పే అవుతుంది. 4, ఈరోజు ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకుంటే దాని బదులుగా చాలా విలువైనది ఏదో ఒక రోజు మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అదే ( seven important lessons to learn in Baby movie ) ఈ సినిమాలో హీరోయిన్ ఆశపడి తీసుకున్న గిఫ్ట్స్ కి.. ఆమె చాలా విలువైనది ఇచ్చింది. 5, ప్రేమ అనే పిచ్చిలో పడి మనల్ని అభిమానించే వాళ్ళుని, మనల్ని చూసుకునే వాళ్ళని మనం పట్టించుకోకపోతే.. వాళ్ళు ఒకరోజు మనకు దూరమైన రోజు కావాలనుకున్న కూడా, వాళ్ళ విలువ ఎంత తెలిసిన వెనక్కి రారు. ఈ సినిమాలో హీరోకి తల్లి విషయంలో అదే జరుగుతుంది.

these-are-the-seven-important-lessons-to-learn-in-baby-movie

6, ఈ సినిమాలో హీరోయిన్ ( ఆడవాళ్లు) ఎన్ని తప్పులు చేసినా ఆమె చివరికి బాగానే ఉంటుంది పెళ్లి చేసుకొని హాయిగా సెటిల్ అవుతాది. కానీ అలాగే డబ్బున్న విరాజ్ కూడా ఏదోరోజు మూవ్ ఆన్ అయ్యి.. బాగానే ఉంటాడు. కానీ డబ్బు లేని వాడు.. ప్రేమే తన ప్రాణం అనుకునేవాడు చివరికి ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఈ సినిమాలో ఆనంద్ జీవితం అలానే నాశనం అవుతుంది. 7, అమ్మాయిలు మాత్రమే మోసం చేస్తారని అనుకోనవసరం లేదు. అబ్బాయిలు కూడా అమ్మాయిలను మోసం చేస్తారు. కానీ మోసపోయిన అబ్బాయిలు ఒక్కలు మాత్రమే.. తన సర్వస్వాన్ని కోల్పోయి జీవితాన్ని సంకనాకించుకుంటారు. అమ్మాయిలకు ఎంత బాధ ఉన్నా.. తన చుట్టూ ఉన్నవాళ్ళంటే భయంతోనో, గౌరవంతోనో మూవ్ ఆన్ అవ్వగలరు. కాబట్టి ఈ సినిమా నుంచి ఈ పాఠాలు నేర్చుకుని ఈ జనరేషన్ కొంచెం జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకుంటే.. వాళ్ల జీవితంలో ఇలాంటి బాధలు రావు..