Home Cinema Babloo : ఈ కమెడియన్ గుర్తు ఉన్నాడా ..? ఇపుడు ఎక్కడ ఎం చేస్తున్నాడో తెలుసా..

Babloo : ఈ కమెడియన్ గుర్తు ఉన్నాడా ..? ఇపుడు ఎక్కడ ఎం చేస్తున్నాడో తెలుసా..

Babloo : కొంతమంది కమెడియన్స్ ని మనం అంత తేలికగా మరచిపోలేము. చేసింది తక్కువ సినిమాలే అయ్యుండొచ్చు, మిగిలిన కమెడియన్స్ తో పోలిస్తే పెద్దగా కామెడీ టైమింగ్ కూడా లేకపోయియుండొచ్చు. కానీ అదృష్టం ఉంటే చాలు, అవకాశాలు దాని అంతటా అవే పరిగెత్తుకుంటూ వస్తాయి అని నిరూపించిన అతి తక్కువ మంది కమెడియన్స్ లో ఒకరు బబ్లూ(Comedian Babloo). ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘చిత్రం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బబ్లూ, ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

babloo-comedian

పొట్ట చక్కలు అయ్యే రేంజ్ కామెడీ అయితే ఇప్పటి వరకు అతను చెయ్యలేదు. కానీ పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కింది. ఒక్క మహేష్ బాబు మరియు ప్రభాస్ సినిమాలు ఒక్కటే మిస్ అయ్యాయి అట. మహేష్ బాబు తో మూడు సార్లు నటించే అవకాశం వచ్చింది కానీ, కాల్ షీట్స్ ని సర్దుబాటు చెయ్యలేక వదులుకోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత ప్రభాస్ సినిమాల్లో నటించే అవకాశం రాలేదు కానీ, అతను తన స్నేహితుడని, నేను వెళ్లే జిమ్ కి వచ్చి తరచూ వర్కౌట్స్ చేసుకొని వెళ్ళేవాడిని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు బబ్లూ.

See also  Sandeep Reddy Vanga : వామ్మో.. చిరంజీవితో అలాంటి కోరిక ఉందని చెప్పిన సందీప్ రెడ్డి వంగ..

babloo

ఎప్పుడూ చేతినిండా సినిమాలతో బిజీ గా ఉండే బబ్లూ(Comedian Babloo), ఈమధ్య కాలం లో సినిమాలకు బాగా దూరం అయ్యాడు. ఇదే విషయాన్నీ ఆయన అడగగా ‘కెరీర్ లో పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు నాకు ఎంతో ఇష్టమైన మా నాన్న చనిపోవడం నన్ను ఎంతో బాధకి గురి చేసింది. చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళాను. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆ డిప్రెషన్ లో ఉండడం వల్ల కోల్పోతూ వచ్చాను. అలా కెరీర్ లో జోరు తగ్గింది. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాను కానీ అంతకు ముందు వచ్చినన్ని అవకాశాలు రావడం లేదు’ అని చెప్పుకొచ్చాడు బబ్లూ.

See also  Ileana: తన భర్త ఎవరో తెలిపిన ఇలియానా. పెళ్ళి అప్పుడు చేసుకున్నానంటూ వెల్లడి.

comedian-babloo

అయితే జబర్దస్త్ వంటి షోస్ ఉన్నాయి కదా, కనీసం అలాంటి షోస్ ద్వారా అయినా అలరించొచ్చు కదా అని యాంకర్ అడిగిన ప్రశ్న కి సమాధానం చెప్తూ ‘జబర్దస్త్ లో కూడా ఆఫర్స్ వచ్చాయి, కానీ అక్కడ స్క్రిప్ట్స్ సొంతం గా రాసుకోవాలి, అది నాకు రాదు, అందుకే వెళ్ళలేదు’ అని చెప్పుకొచ్చాడు బబ్లూ. ఊహించుకోండి ఒకవేళ బబ్లు కానీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కి వచ్చి ఉంటె బలే ఉండేది కదా. ఏదిఏమైనప్పటికీ మన చిన్ననాటి కమెడియన్ ఇలా కనుమరుగైపోవటం చాలా బాధగా ఉంది. ఆ రకం కామెడీ మిస్ అవుతునామ్ అనే చెప్పుకోవాలి.