Home Cinema Project K : ప్రాజెక్ట్ కె ప్రభాస్ ఫస్ట్ లుక్ గురించి వాళ్ళు ఏమంటున్నారంటే..

Project K : ప్రాజెక్ట్ కె ప్రభాస్ ఫస్ట్ లుక్ గురించి వాళ్ళు ఏమంటున్నారంటే..

fans-comment-on-prabhas-first-look-in-project-k-movie

Project K : నాగ్ అశ్విన్‌ల దర్శకత్వంలో, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకునే హీరోయిన్ గా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టు కె సినిమా భారత దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ అభిమానులకు మాత్రమే ( Prabhas first look in Project K ) కాకుండా సినీ అభిమానులందరికీ ఇంకా సినీ ఇండస్ట్రీకి కూడా ఈ సినిమాపై అంచనాలు మాత్రమే కాకుండా.. యావత్ ప్రపంచంలో భారతీయ సినిమా రంగానికి ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఈరోజు ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

fans-comment-on-prabhas-first-look-in-project-k-movie

సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్, దిశా పటాని వంటి ప్రముఖ తారలు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ కూడా కేవలం భారత దేశంలోనే కాకుండా.. ప్రపంచమంతా కూడా వైరల్ అవుతుంది. ప్రాజెక్టు కె టైటిల్ ( Prabhas first look in Project K ) ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇటీవల ప్రాజెక్టుకే లో దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఆ పోస్టర్ చూసి అందులో దీపికా పదుకునే లుక్స్ చూసి అందరూ అదిరిపోయింది అంటున్నారు. మరి ఈ సినిమా టైటిల్ ని జూలై 21వ తేదీన అమెరికాలో జూలై 20న విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీగా ఉంది. వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ సినిమా అని మనందరికీ తెలిసిందే.

See also  Shaakuntalam: శాకుంతలం లో సమంత కట్టుకున్న ఈ చీర నగల విలువ ఎంత తెలిస్తే షాక్ అవుతారు

fans-comment-on-prabhas-first-look-in-project-k-movie

ఈ సినిమాతో వైజయంతి మూవీస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నిర్మాణ సంస్థ అవుతుంది. ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్శకుడు విపరీతంగా కష్టపడుతున్నాడు. ప్రాజెక్టు కె సినిమాని జనవరి 12 సంక్రాంతి ( Prabhas first look in Project K ) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్రయత్నిస్తుంది. ప్రాజెక్టు కె సినిమాపై అందరూ ఆసక్తితోనే ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలో కూడా ప్రాజెక్టు కె సినిమా గురించి ఎంత సందడి చేశారో మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఈ మూడు సినిమాల్లో ఏదీ కూడా బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయాయి. దీనితో ప్రభాస్ అభిమానులు కొంత నిరుత్సాహంతో ఉన్న మాట నిజమే..

See also  52 ఏళ్ల వయసులో కూడా రమ్యకృష్ణ ఏంటి బాబోయ్ ఈ అందం. స్టన్నింగ్ లుక్స్.

fans-comment-on-prabhas-first-look-in-project-k-movie

ఎప్పుడైతే ప్రాజెక్టుకే ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందో.. ఈరోజు అది చూసి అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇందులో ప్రభాస్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్టర్ చూసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి లుక్ తో ఇంతవరకు టాలీవుడ్ హీరోస్ ఎవ్వరూ కనిపించలేదని.. దాదాపు ఐరన్ మాన్ లుక్ ని పోలివున్న ప్రభాస్ ని చూడగానే ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదని.. ఈ సినిమా ఎక్కడికో వెళ్తుందని.. కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు మరోసారి చాలా గట్టిగా మారు మ్రోగుతుందని.. గ్లోబల్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతాడని.. ఇక ఏ జాతకులు ఏం చెప్పినా కూడా.. ప్రభాస్ స్పీడ్ ని గాని.. సక్సెస్ను గాని ఆపే వాళ్ళు లేరని.. కచ్చితంగా మా హీరో కొట్టబోయే హిట్టుని ఊహించను కూడా ఊహించలేరని.. ప్రభాస్ అభిమానులు ఎంతో విశ్వాసంగా, ధైర్యంతో చెప్పుకుంటున్నారు..