Home Cinema Anchor Rashmi: అవును నాకు అలా చేసేవాడే కావాలంటూ రాబోయే భర్త పై ఆసక్తికరమైన వ్యాక్యలు...

Anchor Rashmi: అవును నాకు అలా చేసేవాడే కావాలంటూ రాబోయే భర్త పై ఆసక్తికరమైన వ్యాక్యలు చేసిన రష్మీ.

Rashmi Gautams: ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో హీరోయిన్ అవుదామని అడుగు పెట్టిన రష్మి గౌతమ్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ వాటి వల్ల ఉపయోగం అయితే అంతగా లభించలేదు. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ తన యాంకర్ ని కొనసాగించిందో అప్పుడు తన హవా మొదలయ్యిందనే చెప్పాలి. యాంకర్ గా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో అవకాశాలు అందాయి. అందులో కొన్ని చిత్రాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ..

anchor-rashmi-gautams-describes-the-qualities-of-a-man-to-become-her-husband

ఆచి తూచి అడుగేయకుండా వచ్చిన సినిమాలకు కమిట్ అవుతూ చేయడం వల్ల ప్రస్తుతం మళ్ళీ యాంకరింగ్ జీవితాన్ని కొనసాగిస్తుంది ఈ సుందరి. ప్రస్తుతం స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఇటు బుల్లి తెరపై అటు వెండి తెర పై కూడా తలుక్కుమంటుంది ఈ తార. యాంకరింగ్ గా తన దైన శైలిలో ముందుకు దూసుకుపోతూ తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మూట గట్టుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో ఈ అమ్మడు కూడా నటిస్తున్నది.

See also  kamal haasan: అందుకే కమల్ హాసన్ ని చితక్కొట్టానంటున్న ఆ జంబలకడిపంబ ఎవరో తెలుసా?

anchor-rashmi-gautams-describes-the-qualities-of-a-man-to-become-her-husband

ఎలా అయినా ఈ ఒక్క చిత్రంతో తన తల రాత మార్చుకునే ప్రయత్నం అయితే జోరుగా చేస్తుందట. మరేమవుతుందో సినిమా విడుదల అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కాగా ప్రతి ఆదివారం వచ్చే శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలో తను హోస్ట్ గా చేస్తున్నది. అందులో భాగంగానే ఈ ఆదివారం విడుదల అయ్యే ప్రోమోలో భాగంగా యాంకర్ రష్మీ తన భర్తకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవును నాకు అలా చేసేవాడే కావాలంటూ రాబోయే భర్త పై ఆసక్తికరమైన వ్యాక్యలు చేసిన (Rashmi Gautams) రష్మీ.

See also  Hi Nanna : హాయ్ నాన్న లో ఆ బోల్డ్ సీన్స్ గురించి సూపర్ సీక్రెట్ బయట పెట్టిన నాని..

anchor-rashmi-gautams-describes-the-qualities-of-a-man-to-become-her-husband

తనకు కాబోయే అతడు చెప్పిందే చేయాలి చేసేది చెప్పాలి అంటూ ప్రోమో లో భాగంగా తెలిపింది. దీంతో నెట్టింట ఒక్క సారిగా ఆమె మాటలు వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా జోరుగా కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. మరి కొందరైతే కచ్చితంగా సుడిగాలి సుదీర్ కరెక్ట్ గా సెట్ అవుతాడంటూ.. సుడిగాలి సుదీర్ మాత్రమే చేసేదే చేస్తాడు చెప్పిందే చేస్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళిద్దరి జోడి అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా ఒక్క సారిగా రష్మీ గౌతమ్ చేసిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏమో మరి త్వరలో వీళ్లిద్దరు వాలకం చూస్తుంటే గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నారు అంటూ మరికొందరు కామెంట్ చేస్తు తెగ ట్రోల్ కు గురి చేస్తున్నారు.